నేరాల అదుపునకు అంకిత భావంతో పని చేయాలి : డీఎస్పీ రవి
నేరాల అదుపునకు పోలీస్ సిబ్బంది అంకితభావంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని మిర్యాలగూడ డీఎస్పీ రవి అన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా గురువారం నిడమనూరు పోలీస్ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. నేరాల సంఖ్య, రోడ్డు ప్రమాదాలు...
– నిడమనూరు పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ
నిడమనూరు, అక్టోబర్ 29 : నేరాల అదుపునకు పోలీస్ సిబ్బంది అంకితభావంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని మిర్యాలగూడ డీఎస్పీ రవి అన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా గురువారం నిడమనూరు పోలీస్ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. నేరాల సంఖ్య, రోడ్డు ప్రమాదాలు, పోలీస్ స్టేషన్ భవనం నిర్వహణ, సిబ్బంది పని తీరు, పెండింగ్ కేసుల దర్యాప్తు, శాంతి భద్రతల పరిరక్షణ, దొంగతనాల నివారణకు తీసుకుంటున్న చర్యలకు సంబంధించిన రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ శాంతి భద్రతల పరిరక్షణలో స్ఫూర్తిదాయకంగా నిలవాలని సూచించారు.
అనేక ఒత్తిడుల నడుమ విధులు నిర్వర్తించే సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ, ఒత్తిడి నుండి ఉపశమనం పొందేందుకు యోగా చేయాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల సహకారం అవసరమన్నారు. సకాలంలో నేర స్థలానికి చేరుకుని బాధితులకు న్యాయం చేయడంలో ముందుండాలని సూచించారు. ఆయన వెంట హాలియా సీఐ ఎస్.రాఘవరావు, ఎస్ఐ డి.విజయ్ కుమార్, హెడ్ కానిస్టేబుళ్లు వెంకటేశ్వర్లు, కె. యాదగిరి, సిబ్బంది సత్యనారాయణ చారి, ప్రేమ్ చందన్, రామంజి, మహేశ్, నౌషీన్, మానస, నరేందర్, రాజు ఉన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నేరాల అదుపునకు అంకిత భావంతో పని చేయాలి : డీఎస్పీ రవి
‘ఏఐకేఎస్ మహా సభలను జయప్రదం చేయండి’
మత్తు పదార్థాల నివారణకు పాటుపడాలి : ఎస్పీ ఆక్షాష్ యాదవ్
Y.S. Jagan | చంద్రబాబు నాయుడు లాంటి రాక్షసుడితో యుద్ధం చేస్తున్నాం : వైఎస్ జగన్
Woman lost outside Zoo | భర్తతో కలిసి జూకు వెళ్లి అదృశ్యమైన భార్య.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

