ఆడబిడ్డల ఆత్మగౌరవం పెంచిన ఘనత కేసీఆర్‌దే
పోరాడి రాష్ర్టాన్ని సాధించి అధికారం చేపట్టిన పదేండ్లలో అన్ని రంగాల అభివృద్ధిపాటు ఆడబిడ్డల ఆత్మగౌరవం పెంచిన ఘనత బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.
- కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అందులో భాగమే..
- కేసీఆర్ ముందు చూపుతో పెట్టిన సంక్షేమ పథకాలే అందరికీ అండగా నిలిచాయి
- కాంగ్రెస్ వస్తే తులం బంగారం అదనంగా వస్తదని ఆశపడ్డారు
- ఇన్ని రోజులు ఆలస్యమైతే నిజమేనని నమ్మినం
- చివరికి కేసీఆర్ తెచ్చిందే అమలు
- మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
- 407 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
సూర్యాపేట టౌన్/ఆత్మకూర్.ఎస్, జూలై 22 : పోరాడి రాష్ర్టాన్ని సాధించి అధికారం చేపట్టిన పదేండ్లలో అన్ని రంగాల అభివృద్ధిపాటు ఆడబిడ్డల ఆత్మగౌరవం పెంచిన ఘనత బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అందులో భాగమేనని, అంతే కాకుండా అత్యధికంగా సంక్షేమ పథకాలు మహిళల పేరిట అందించిన ఘనత కూడా ఆయనదేనని తెలిపారు. సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా సోమవారం ఆయన 407 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఆత్మకూర్.ఎస్, పెన్‌పహాడ్ ఎంపీడీఓ కార్యాలయాల తర్వాత సూర్యాపేట కలెక్టరేట్ జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యమ సమయంలో అందరి కష్టాలు తెలుసుకున్న కేసీఆర్ సమాజంలో ఆడపిల్లలు కుటుంబానికి భారం కాకూడదని భావించి వారిపేరు మీద అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, నేడు అవే అందరికీ అండగా నిలుస్తున్నాయని అన్నారు.
కాంగ్రెస్ వస్తే కేసీఆర్ ఇస్తున్న రూ.లక్షతోపాటు మరో తులం బంగారం అదనంగా వస్తదని ఆశపడి ప్రజలకు వారికి అధికారం ఇచ్చారని, కానీ ఇప్పుడు వారికి ఎందుకు ఓటు వేశామా అని బాధపడుతున్నారని తెలిపారు. సంక్షేమ పథకాలు అందించడం ఇన్ని రోజులు ఆలస్యమైతే తాము కూడా నిజమేనని నమ్మామని, కానీ నేడు అక్కాచెల్లెళ్ల ఆశలు అడియాశలయ్యాయని, చివరికి కేసీఆర్ తెచ్చిందే అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. పథకాల అమలుతోపాటు 6 గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, ఆర్డీఓ వేణు మాధవరావు, తాసీల్దార్లు వినోద్‌కుమార్, మహేందర్‌రెడ్డి, ఎంపీడీఓలు ఎండీ హసీం, వెంకటేశ్వర్రావు, డిప్యూటీ తాసీల్దార్ హరిశ్చంద్రప్రసాద్, పీఏసీఎస్ చైర్మన్లు కొణతం సత్యనారాయణరెడ్డి, వెన్న సీతారాంరెడ్డి, నాతాల జానకిరాంరెడ్డి, ఆర్ఐ రమేశ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

