Governor Shukla | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ శుక్లా
Governor Shukla | తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా కుటుంబ సమేతంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని శనివారం దర్శించు కున్నారు.
యాదాద్రి భువనగిరి : తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ( Governor Shukla ) కుటుంబ సమేతంగా యాదగిరిగుట్ట ( Yadadri ) శ్రీ లక్ష్మీనరసింహస్వామిని శనివారం దర్శించు కున్నారు. ఈ సందర్భంగా ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు.
రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, దేవస్థాన కార్యనిర్వహణాధికారి భవానీ శంకర్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ , దేవస్థానం బోర్డు సభ్యులు లక్ష్మీనారాయణ తదితరులు గవర్నర్‌కు ఘనంగా స్వాగతం పలికారు.
జనార్ధనానంద సరస్వతి స్వామి సంస్కృతి ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్టోబర్ 28వ తేదీ నుంచి యాదగిరిగుట్ట దేవస్థానంలో నిర్వహిస్తున్న తెలంగాణ వేద విద్వన్మహాసభలకు గవర్నర్ హాజరై విచ్చేశారు. దర్శనానంతరం అర్చకులు వేదమంత్రాలతో వేదాశీర్వచనం అందజేశా రు. ఆలయ ఈవో స్వామివారి జ్ఞాపిక (మొమెంటో), ప్రసాదాలను గవర్నర్‌కు అందజేశారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ వేదాల గురించి పిల్లలకు అవగాహన వస్తే మన ప్రాచీన సాంస్కృతిక మ, విద్యా సంప్రదాయం కచ్చితంగా పరిరక్షించబడు తుందని పేర్కొన్నారు. ప్రకృతి పరిరక్షణ, అభివృద్ధి , నైతికతతో ఎలా బతకాలి అనే విషయాలతో పాటు శాస్త్రీయ కోణాలపై జ్ఞానం పెరుగుతుందని అన్నారు. ఎల్‌నినో కారణంగా వర్షపాతం లోటు దరిమిలా నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఈ బాధ్యత కేవలం ప్రభుత్వానిదే కాదని ప్రజలపై కూడా ఉందని వివరించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governor Shukla | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ శుక్లా
Revolt brews in NC | ఎన్సీలో తిరుగుబాటు?.. 19 మంది ఎమ్మెల్యేల భేటీ, తీర్మానం
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

