ఎంజీయూ విద్యార్థినికి లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ ఆర్థిక సాయం
మాతృ వియోగంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ చదువుకు దూరమైన మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఎం.ఏ.ద్వితీయ సంవత్సరం విద్యార్థిని గద్దపాటి నవ్యకు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ డైమండ్ ఆధ్వర్యంలో రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు.
రామగిరి, అక్టోబర్ 30 : మాతృ వియోగంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ చదువుకు దూరమైన మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఎం.ఏ.ద్వితీయ సంవత్సరం విద్యార్థిని గద్దపాటి నవ్యకు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ డైమండ్ ఆధ్వర్యంలో రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. విద్యార్థిని తల్లి అనారోగ్యంతో మృతి చెందడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. హాస్టల్ ఫీజు చెల్లించలేక నెలకు పైగా కళాశాలకు దూరమైన నవ్య పరిస్థితిని తెలుగు శాఖ అధ్యాపకురాలు డాక్టర్ సి. అనితాకుమారి క్లబ్ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన క్లబ్ సభ్యులు శుక్రవారం విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ చేతుల మీదుగా రూ.10 వేల సాయం అందించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.అంజిరెడ్డి, క్లబ్ సభ్యులు ఎదుల్ల అంజిరెడ్డి, మేడ మోహన్ రెడ్డి, మైల అశోక్ రెడ్డి, పాల్వాయి రాంరెడ్డి, సామా సంజీవరెడ్డి, నన్నూరు నాగిరెడ్డి, అధ్యాపకులు డాక్టర్ వై. ప్రశాంతి, డాక్టర్ మారం వెంకటరమణారెడ్డి, ప్రొఫెసర్ రఘురాం పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎంజీయూ విద్యార్థినికి లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ ఆర్థిక సాయం
‘మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి’
Srinivas Goud | ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తం కరువు జిల్లాగా ప్రకటించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
‘చట్టాలపై అవగాహన పెంచుకోవాలి’
Watch: కర్వా చౌత్ రోజున ప్రియుడిని కలిసిన భార్య.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

