Nalgonda : ‘బీసీ ప్రజా ప్రతినిధులు తక్షణమే పదవులకు రాజీనామా చేయాలి’
బీసీ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉన్న గడియారం సెంటర్లో బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గాడిదలకు బ్యానర్లు కట్టి నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. బీసీ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ..
– బీసీ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్
– బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నల్లగొండలో గాడిదలతో ఊరేగింపు
నల్లగొండ, నవంబర్ 29 : బీసీ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉన్న గడియారం సెంటర్లో బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గాడిదలకు బ్యానర్లు కట్టి నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. బీసీ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీలకు చట్టబద్దంగా ఇస్తామన్నా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోగా, బీసీలను నమ్మించడానికి తమ పార్టీ పరంగా బీసీలకు 42 శాతం నుండి 60 శాతం వరకు జనరల్ స్థానాల్లో కూడా అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్, బిజెపిలు ప్రకటించాయని, కానీ ఆచరణలో అమలు చేయడానికి కనీస కసరత్తు కూడా చేయడం లేదని ఆయన ఆరోపించారు. బీసీలకు నిజంగానే రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు బీసీలపైన చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం గతంలో తెచ్చిన జీఓ నంబర్ 9 ద్వారా బీసీలకు రాష్ట్ర వ్యాప్తంగా 5,300 సర్పంచ్ స్థానాలను అన్ని జిల్లాల్లో, వివిధ గ్రామాలను బీసీలకు రిజర్వేషన్ చేసిందని, కనీసం ఈ ప్రతిపదిక అయినా బీసీలకు అవకాశం కల్పిస్తామని ఏ పార్టీ ప్రకటించడం లేదన్నారు. దీనిని బట్టి చూస్తే రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేయడానికి ప్రకటనలు గుప్పిస్తారు తప్పా ఆచరణలో మాత్రం శూన్యమని అన్నారు.
సర్పంచులుగా బీసీలు ఎన్నికల బరిలో నిలబడాలి
అగ్రకుల రాజకీయ పార్టీల మోసాన్ని బీసీలు గ్రహించి బీసీలకు చట్టబద్ధంగా రావాల్సిన ఆరు వేల గ్రామ పంచాయతీలు బీసీలవేనని, జనరల్ కోటా అంటే అగ్ర కులాలకు రిజర్వేషన్ కాదని, బీసీ రిజర్వేషన్లను గండి కొట్టి బీసీ రిజర్వేషన్లకు రావాల్సిన గ్రామ సర్పంచ్ స్థానాలను జనరల్ గా మార్చారని, అందుకే జనరల్ స్థానాలు కూడా బీసీలు కైవసం చేసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా జనరల్ స్థానాల్లో సర్పంచులుగా బీసీలు ఎన్నికల బరిలో నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. జనరల్ స్థానాల్లో నిలబడిన బీసీలను గెలిపించుకునే బాధ్యత బీసీ సమాజం తీసుకుంటుందన్నారు. బీసీల రాజ్యాధికారానికి సర్పంచుల సీటే ప్రాతిపదిక కావాలన్నారు.
ఎన్నికల షెడ్యూల్ తో సంబంధం లేకుండా బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని తెలిపారు. అందులో భాగంగా గాడిదలతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్లు చిలకరాజు సతీష్‌కుమార్, మార్గం సతీష్‌కుమార్, కన్వీనర్ కర్నాటి యాదగిరి, పట్టణ చైర్మన్, పుట్ట వెంకన్న గౌడ్, ప్రధాన కార్యదర్శి గజ్జి అజయ్ కుమార్ యాదవ్, జాయింట్ సెక్రటరీలు అనంత నాగరాజు గౌడ్, గడగోజు విజయ్, చెన్నోజు రాజు, ముదిరాజ్ సంఘం నాయకుడు దొడ్డు కృష్ణమూర్తి, యువజన సంఘం నాయకులు కొంపల్లి రామన్న గౌడ్ పాల్గొన్నారు.

Nalgonda : ‘బీసీ ప్రజా ప్రతినిధులు తక్షణమే పదవులకు తక్షణమే రాజీనామా చేయాలి’
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nikeelu Gunda | సూపర్ ఏఐ అకాడమీ ఫౌండర్ నికీలు గుండాకు ప్రతిష్ఠాత్మక పురస్కారం
100 Feets Master Plan Road | మేం కష్టపడి కట్టుకున్న స్కూల్ పోతుంది.. 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు రీఅలైన్మెంట్పై బాధిత మహిళ
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

