యాదగిరి నర్సన్నకు పొన్న వాహన సేవ
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుడి బ్రహోత్సవాల్లో భాగంగా స్వామివారి అలంకార సేవలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. శనివారం ఉదయం నిత్యపూజా కైంకర్యం అనంతరం స్వామివారు శ్రీమన్నారాయణుడి పూర్వఅవతారమైన శ్రీకృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు.
- లక్ష్మీనరసింహస్వామికి వైభవంగా అలంకార సేవలు
- తిరుమాఢవీధుల్లో భక్తులకు దర్శనభాగ్యం
- ఉదయం శ్రీకృష్ణాలంకారం
- నేడు గోవర్ధనగిరిధారిగా సాక్షాత్కరించనున్న స్వామివారు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అలంకార సేవలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. శనివారం ఉదయం నిత్యపూజా కైంకర్యం అనంతరం లక్ష్మీనరసింహుడు శ్రీమన్నారాయణుడి పూర్వఅవతారమైన శ్రీకృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు.
మురళీకృష్ణుడిగా దివ్యమైన వేణుగాన నాదంతో సమస్త ప్రాణికోటికి చైతన్యాన్ని, బలాన్ని, జ్ఞానాన్ని, ముక్తిని ప్రసాదించిన అపూర్వ స్వరూపం శ్రీకృష్ణావతారమని ఆలయ ప్రధానార్చకుడు నల్లన్‌థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు వివరించారు. స్వామివారిని రాత్రి పొన్నవాహన సేవపై అధిష్టించి తిరు మాఢవీధుల్లో ఊరేగించారు. వృక్షమును దేవవృక్షంగా, కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షంగా పురాణాలు పేర్కొంటున్నాయి. సాయంత్రం వైటీడీఏ ఆధ్వర్యంలో చేపట్టిన నృత్య ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆదివారం ఉదయం లక్ష్మీనరసింహుడు గోవర్ధనగిరిధారిగా,రాత్రి సింహ వాహనంపై దర్శనమివ్వనున్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుడి బ్రహోత్సవాల్లో భాగంగా స్వామివారి అలంకార సేవలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. శనివారం ఉదయం నిత్యపూజా కైంకర్యం అనంతరం స్వామివారు శ్రీమన్నారాయణుడి పూర్వఅవతారమైన శ్రీకృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు. మురళీకృష్ణుడిగా దివ్యమైన వేణుగాన నాదంతో సమస్త ప్రాణికోటికి చైతన్యాన్ని, బలాన్ని, జ్ఞానాన్ని, ముక్తిని ప్రసాదించిన అపూర్వ స్వరూపం శ్రీకృష్ణావతారమని ఆలయ ప్రధానార్చకుడు నల్లన్‌థిఘళ్ లక్ష్మీనరసింహచార్యులు వివరించారు. స్వామివారిని రాత్రి పొన్నవాహన సేవపై అధిష్టించి తిరు మాఢవీధుల్లో ఊరేగించారు.

పొన్న వాహన సేవ ఇలా..
భక్తపారాయణుడు, జగదక్షకుడు, శ్రీమహావిష్ణువు లోకకల్యాణార్థం అవతరించిన అవతార రూపాల్లో లక్ష్మీనరసింహస్వామి దివ్యవాహన సేవలు అందుకుంటున్నారు. రాత్రి ప్రధానాలయంలో స్వామివారి నిత్యకైంకర్యాల అనంతరం ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, ఉప ప్రధానార్చకులు, అర్చక బృందం, పారాయణికులు స్వామివారిని పొన్న వాహన సేవలో అలంకరించి ఊరేగింపు నిర్వహించారు. వేదపురాణ, ఇతిహాస ప్రవచనాలు, సాహిత్యం, శాస్త్రం, వేదం, నాదం వంటి వైదృశ్యాలతో స్వామివారి వాహన సేవ ప్రధానాలయ తిరు మాఢవీధుల్లో అత్యంత వైభవంగా జరిగింది. పంచసూక్తాలు, ఉపనిషత్తులు పఠిస్తుండగా ఆలయ తిరుమాఢవీధుల్లో స్వామివారి సేవ కొనసాగింది. పశ్చిమ దిశలో గల వేంచేపు మండపంలో స్వామివారిని ఆస్థానం చేశారు. స్వామివారి అలంకారమైన నాలుగు వేదాలు, పొన్న వాహన సేవ సూక్తులను పఠించారు. దివ్య ప్రబంధంలోని వాహనసేవ వైభవ పాశురాలను పఠిస్తూ స్వామివారి సేవ విశిష్టతను ప్రధానార్చకులు వివరించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈఓ ఎన్.గీత, డీఈఓ దోర్బల భాస్కర్, ఏఈఓ గజవెల్లి రమేశ్‌బాబు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
శ్రీకృష్ణ దర్శనం.. సమస్త ప్రాణకోటికి మోక్షం
భగవానుడు అవతరించిన అవతారాలలో అపూర్వమైన అవతారమే శ్రీకృష్ణావతారం. ఎన్నో అద్భుతాలను దర్శింపజేసిన కృష్ణావతారంలో మురళీకృష్ణుడిగా తన దివ్యమైన వేణుగాననాదంతో సమస్త ప్రాణకోటి చైతన్యాన్ని, బలాన్ని, జ్ఞానాన్ని, ముక్తిని అందించిన అపూర్వ స్వరూపమని సర్వదా స్మరణీయమని ఆలయ ప్రధానార్చకులు నల్లన్‌థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు. పరమాత్మగా కృష్ణుడు, జీవాత్మలకు ప్రతీకమైన గోవులు, గోపాలురను, గోపికలను మధురానగర భక్తులను రక్షించి, ఆనందింపజేసి అనుగ్రహించిన అవతారమే శ్రీకృష్ణావతారం. శ్రీకృష్ణావతార అలంకార దర్శనం ఎంతో ముక్తిదాయకమని ప్రధానార్చకులు చెప్పారు.
శ్రీకృష్ణ దర్శనం.. సమస్త ప్రాణకోటికి మోక్షం
భగవానుడి అవతారాలల్లో అపూర్వమైనది శ్రీకృష్ణావతారం. ఎన్నో అద్భుతాలను దర్శింపజేసిన కృష్ణావతారంలో మురళీకృష్ణుడిగా తన దివ్యమైన వేణుగాననాదంతో సమస్త ప్రాణకోటికి చైతన్యాన్ని, బలాన్ని, జ్ఞానాన్ని, ముక్తిని అందించినట్లు ఆలయ ప్రధానార్చకులు నల్లన్‌థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు. పరమాత్మగా కృష్ణుడు జీవాత్మలకు ప్రతీకమైన గోవులు, గోపాలురను, గోపికలను మధురానగర భక్తులను రక్షించి, ఆనందింపజేసి అనుగ్రహించిన అవతారమే శ్రీకృష్ణావతారమనిశ్రీకృష్ణావతార అలంకార దర్శనం ఎంతో ముక్తిదాయకమని ప్రధానార్చకులు చెప్పారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి ప్రధానాలయం ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకున్నది. తిరుమాఢవీధుల్లోని ఉత్తర దిశలో నిర్మించిన సాంస్కృతిక మండపంలో కళాకారుల నాట్యాలు, సంగీత విద్వాంసుల కచేరీలు భక్తులను మంత్రముగ్దులను చేస్తున్నాయి. శనివారం చెన్నైకి చెందిన శ్రీదేవి నృత్యాలయం ఆధ్వర్యంలో భరతనాట్యం, మంజుల రామస్వామి కళాకారులచే భరతనాట్య ప్రదర్శన ఆకట్టుకున్నాయి. డాక్టర్ శివప్రసాద్, మోండలిన్ విద్యాంసులు యు.పి.రాజు ఆధ్వర్యంలో ఈల పాట సంగీత కచేరీ భక్తులను మైమరిపించింది.
భక్తకోటికి అనుగ్రహం

పొన్న వృక్షమును దేవవృక్షంగా పురాణాలు పేర్కొన్నాయని ఆలయ ప్రధానార్చకులు నల్లన్‌థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు. అందుకే దానికి కల్పవృక్షమని, కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువు అని పేరు.
ఉచిత వైద్య శిబిరం..
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ హరీశ్ ఆధ్వర్యంలో కొండపైన బస్టాండ్ వద్ద, కొండకింద కల్యాణకట్ట వద్ద ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

