పులితో పరాచాకాలు ఆడుతున్న విజయ్ హీరోయిన్

కళ్ల ముందు పులి కనిపిస్తే ఏం చేస్తారు..? ఇంకేం చేస్తారు.. పరుగో పరుగు అంటూ గబుక్కున అక్కడ్నుంచి పారిపోతారు అంతేకదా ..! కానీ ఇక్కడ మాత్రం ఓ హీరోయిన్ పులితో పరాచకాలు ఆడుకుంటుంది. అది కళ్ల ముందు కనిపిస్తున్నా కూడా హాయిగా ఫోటోలకు పోజులు ఇస్తుంది. ఎవరబ్బా ఆ ముద్దుగుమ్మ అనుకుంటున్నారా..? ఆమె పేరు మాళవిక మోహనన్. కేరాఫ్ మాస్టర్ సినిమా. విజయ్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది మాళవిక. ఈ ఒక్క సినిమాతోనే అమ్మడి పేరు బాగానే మార్మోగిపోయింది. దానికి ముందు రజినీకాంత్ హీరోగా వచ్చిన పేటలో కూడా నటించింది మాళవిక.
అయితే అందులో పెద్దగా హైలైట్ కాలేదు. కానీ ఆ తర్వాత మాస్టర్ సినిమాతోనే స్టార్ అయిపోయింది. ఆ సినిమా తర్వాత తెలుగులో కూడా కొన్ని అవకాశాలు వచ్చినా నో చెప్పింది ఈ బ్యూటీ. ముఖ్యంగా రవితేజ లాంటి స్టార్ హీరోకు కూడా నో చెప్పి వార్తల్లో నిలిచింది మాళవిక. ఇప్పుడు హిందీలోనూ డెబ్యూ చేస్తుంది. అక్కడ రెండు సినిమాలకు కమిటైంది మాళవిక మోహనన్. అయితే సినిమాలతో పాటు పర్సనల్ లైఫ్ కు కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ. అందుకే తనకు ఖాళీ టైమ్ దొరికిన ప్రతీసారి బయటికి వెళ్లి ఎంజాయ్ చేస్తుంది. ఈ మధ్యే అడవికి వెళ్లింది ఈ బ్యూటీ. అక్కడ పులి కనిపించినపుడు దాంతో పాటే ఫోటో కూడా దిగింది.
పులి కనిపించినపుడు కంగారు కూడా ఈమె కళ్లలో లేదు. ఏదో తనకు తెలిసిన వాళ్ల ఇంటికి వచ్చినట్లు.. అడవికి వచ్చి అక్కడ జంతువులతో కలిసిపోయింది మాళవిక. డీప్ ఫారెస్ట్ కి వెళ్లి అక్కడ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీని ఎంజాయ్ చేస్తుంది. ఈ మలయాళీ అమ్మాయి ఎంతో ధైర్యంగా అడవిలో విహరిస్తోంది. ఇలా పులికి దగ్గరగా వెళుతూ కూడా ఎంతో ధైర్యంగా అడుగేసింది. మాళవిక షేర్ చేసిన ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది. అది బెంగాల్ టైగర్ కదా అంటూ అభిమానులు కింద కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా పులితో అంత దగ్గరగా ఫోటో దిగడం అనేది చిన్న విషయం కాదు.
Read Today's Latest Movie-gossips News in Telugu and Telugu News
- Tags
- malavika mohanan
- master
- vijay
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

