చిరంజీవి మాటలు స్ఫూర్తినిచ్చాయి

‘కష్టపడితేనే విజయం వరిస్తుందని చిరంజీవిగారు చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకొని ఈ సినిమా చేశా. హీరోగా నాకు చక్కటి శుభారాంభాన్ని అందిస్తుందనే నమ్మకముంది’ అని అన్నారు పవన్‌తేజ్ కొణిదెల. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఈ కథలో పాత్రలు కల్పితం’. రాజేష్‌నాయుడు నిర్మాత. అభిరామ్.ఎమ్ దర్శకుడు. మేఘన కథానాయిక. ఈ నెల 26న ఈ చిత్రం విడుదలకానుంది. మంగళవారం హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గేయరచయిత చంద్రబోస్ మాట్లాడుతూ ‘టైటిల్ బాగుంది. ఈ సినిమాకు సంగీతాన్ని అందించిన కార్తిక్‌తో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ మంచి పేరు తీసుకురావాలి’ అని పేర్కొన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘మెగా ఫ్యామిలీ హీరోతో సినిమా చేయడం ఆనందంగా ఉంది. కథ వినకుండానే నిర్మాత ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి అంగీకరించారు. క్రైమ్ సస్పెన్స్, లవ్, థ్రిల్లర్ అంశాలతో ఆసక్తికరంగా ఉంటుంది’ అని తెలిపారు. ఇలాంటి చిన్న సినిమాల్ని ఆదరించినప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందని గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాజేష్‌నాయుడు, నోయల్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Movie-gossips News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

