హృతిక్ రోషన్ ఒప్పుకుంటే పటాస్ రీమేక్ చేస్తా

తెలుగు దర్శకులకు ఇప్పుడు బాలీవుడ్లో కూడా మంచి డిమాండ్ ఉంది. అందుకే ఇక్కడ్నుంచి వెళ్లిన సందీప్ రెడ్డి వంగా, గౌతమ్ తిన్ననూరి లాంటి దర్శకులు అక్కడ కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. మన సినిమాలను అక్కడ రీమేక్ చేసి విజయాలను అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు సంచలన దర్శకుడు అనిల్ రావిపూడి కూడా తన సినిమాను హిందీలో రీమేక్ చేస్తానంటున్నాడు.
పటాస్ సినిమాతో ఈయన దర్శకుడిగా పరిచయం అయ్యాడు. 2015లో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించడమే కాదు అనిల్ రావిపూడికి దర్శకుడిగానూ మంచి పునాది వేసింది. ఆ తర్వాత సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో వరస విజయాలు అందుకుని టాప్ డైరెక్టర్ అయిపోయాడు అనిల్. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎఫ్ 3 సినిమాతో బిజీగా ఉన్నాడు ఈయన. తనకు బాలీవుడ్లో సినిమా చేసే అవకాశం వస్తే హృతిక్ రోషన్ తో పటాస్ రీమేక్ చేస్తానని ప్రకటించాడు.

ఎఫ్2 సినిమాను ఇప్పటికే హిందీలో రీమేక్ చేస్తున్నారు. కానీ తనకు మాత్రం పటాస్ సినిమాను హృతిక్ రోషన్‌తో రీమేక్ చేయాలని ఉందని చెప్పాడు. సిక్స్ ప్యాక్ బాడీ ఉన్న హృతిక్.. ఏవేవో సినిమాలు చేస్తున్నాడు కానీ తనకు సెట్ అయ్యే కథలు మాత్రం చేయడం లేదంటున్నాడు ఈయన. ఆయనకు సరైన సినిమా పడితే రేంజ్ మరోలా ఉంటుందంటున్నాడు అనిల్. పటాస్ లాంటి మాస్ సినిమా చేస్తే థియేటర్స్ అదిరిపోతాయంటున్నాడు ఈయన.
మరోవైపు తెలుగులో ఈయన చాలా బిజీగా ఉన్నాడు. ఎఫ్ 3 తర్వాత మూడు సినిమాలు చర్చల దశలోనే ఉన్నాయంటున్నాడు అనిల్. అందులో ఒకటి రామ్‌తో ఎప్పట్నుంచో అనుకుంటున్నాడు అనిల్. ఇక బాలకృష్ణతో సినిమా కూడా ఇంకా కన్ ఫర్మ్ కాలేదు. మహేష్ బాబుతో సినిమాపై క్లారిటీ రాలేదు. ఒకసారి ఆయన్ని కలిసి మాట్లాడితే కొలిక్కి వస్తాయంటున్నాడు అనిల్ రావిపూడి. ఏదేమైనా కూడా పటాస్ కానీ హిందీలో అనుకున్నట్లు హృతిక్ రోషన్‌తో రీమేక్ చేస్తే అక్కడ థియేటర్స్ అన్నీ మార్మోగిపోతాయేమో..?
Read Today's Latest Movie-gossips News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
‘కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు కొనసాగించాలి’
ఆంధ్రా విద్యుత్ పునరుద్ధణ పనుల్లో మన ఉద్యోగులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

