అల్లరి నరేష్ ‘నాంది’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..?

అల్లరి నరేష్‌కు దాదాపు 8 ఏళ్ల తర్వాత వచ్చిన విజయం నాంది. కొత్త కథలకు నాంది పలుకుతూ సీరియస్ నోట్లో ఈయన చేసిన సినిమా సూపర్ హిట్ అయింది. కొత్త దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 19న విడుదలైంది. రెండు వారాల్లో రూ.5 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి సూపర్ హిట్ గా నిలిచింది.
ఇండియన్ పీనల్ కోడ్ లోని 211 సెక్షన్ గురించి నాంది సినిమా ఎక్కువగా చర్చించింది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసిందిప్పుడు. నాంది విడుదలైన రోజు నుంచి కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ దూసుకుపోతుంది. నాని లాంటి హీరోలు అయితే అల్లరి కాదు నాంది నరేష్ అని పిలుస్తున్నారు. పేరు మార్చుకోవాలంటూ సలహాలు కూడా ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ సినిమాను మార్చి 12న ఆహాలో స్ట్రీమ్ చేయబోతున్నారు. అంటే విడుదలైన మూడు వారాల తర్వాత ఆహా విడుదల చేస్తుందన్నమాట.
క్రాక్ సినిమాకు ఫాలో అయిన ఫార్ములానే ఇప్పుడు నాందికి కూడా అప్లై చేస్తున్నారు ఆహా నిర్వాహకులు. ఫిబ్రవరి 19న విడుదలైన నాంది సరిగ్గా 24 రోజుల తర్వాత ఓటీటీలో రానుందన్నమాట. సినిమాకు అద్భుతమైన టాక్ రావడం.. ప్రశంసలు దక్కడంతో కచ్చితంగా డిజిటల్ ప్లాట్ ఫామ్‌లో కూడా రికార్డు వ్యూస్ అందుకుంటుందని నమ్ముతున్నారు ఆహా మేకర్స్. ఈ సినిమాను మంచి రేటుకే సొంతం చేసుకున్నారు వాళ్లు. శతమానం భవతి దర్శకుడు సతీష్ వేగేశ్న ఈ సినిమాను నిర్మించాడు.
Read Today's Latest Movie-gossips News in Telugu and Telugu News
- Tags
- Aha
- Allari naresh
- Naandi
- ott
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

