మెదక్ ఎస్పీగా ఉదయ్‌కుమార్ రెడ్డి
మెదక్ ఎస్పీగా ఉదయ్‌కుమార్ రెడ్డి బదిలీపై రానున్నారు. ఆయన హైదరాబాద్ వెస్ట్ జోన్ డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మెదక్‌లో ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న బాలస్వామి హైదరాబాద్ ఈస్ట్ జోన్ డిప్యూటీ కమిషనర్‌గా బదిలీపై వెళ్లనున్నారు.
మెదక్ అర్బన్, జూలై 10: మెదక్ ఎస్పీగా ఉదయ్‌కుమార్ రెడ్డి బదిలీపై రానున్నారు. ఆయన హైదరాబాద్ వెస్ట్ జోన్ డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మెదక్‌లో ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న బాలస్వామి హైదరాబాద్ ఈస్ట్ జోన్ డిప్యూటీ కమిషనర్‌గా బదిలీపై వెళ్లనున్నారు. బాలస్వామి 6, జనవరి 2024న మెదక్ ఎస్పీగా బాధ్యతలు తీసుకున్నారు.
ఆయన బాధ్యతలు తీసుకున్న ఆరు నెలల్లో మెదక్ అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా విజయవంతంగా నిర్వహించారు. జూన్ లో మెదక్ పట్టణంలో ఇరువర్గాల మధ్య ఘర్షణలో భాగంగా మెదక్ పట్టణంతోపాటు జిల్లాలో శాంతిభద్రతలకు భంగం కలుగకుండా, ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. మెదక్ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఆయన నిరంతరం శ్రమించారు. మెదక్ ఎస్పీగా ఉదయ్‌కుమార్ రెడ్డి త్వరలో బాధ్యతలు తీసుకోనున్నారు.
24 మంది ఎస్సైల బదిలీ
సంగారెడ్డి జిల్లాలో పని చేస్తున్న 24 మంది ఎస్సైలు బదిలీ అయ్యారు. ఎస్పీ రూపేశ్ 24 మం ది ఎస్ఐలకు స్థానచలనం కల్పిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన ఎస్ఐలు కొత్త స్థానాల్లో వెంటనే చేరాలని ఎస్పీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. త్వరలో బాధ్యతలు స్వీకరించ నున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

