మహిళా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని.. టీజింగ్, లైంగిక వేధింపులు, అత్తింటివారి ఆగడాలకు గురైన మహిళలు, అమ్మాయిలు, పిల్లలకు రక్షణగా భరోసా కేంద్రం నిలుస్తుందని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
- ఆపదలో ఉన్న మహిళలకు భరోసా కేంద్రం అండ
- వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
- మెదక్‌లో భరోసా సెంటర్, షీటీమ్ నూతన భవనం ప్రారంభోత్సవం
మెదక్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): మహిళా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని.. టీజింగ్, లైంగిక వేధింపులు, అత్తింటివారి ఆగడాలకు గురైన మహిళలు, అమ్మాయిలు, పిల్లలకు రక్షణగా భరోసా కేంద్రం నిలుస్తుందని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం మెదక్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ రాజర్షి షా, స్థానిక ఎమ్మెల్యే రోహిత్‌రావుతో కలిసి రూ.2 కోట్లతో నిర్మించిన భరోసా కేంద్రాన్ని, షీ టీమ్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భరోసా కేంద్రానికి వచ్చే బాధిత మహిళలు రాత్రి వేళలో ఉండేందుకు, కౌన్సెలింగ్, న్యాయ సాయం కోసం అవసరమైన అన్ని వసతులు కల్పిస్తూ ఆధునిక హంగులతో నూతన భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు.
జిల్లాలో 2022 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు 135 కేసులు నమోదయ్యాయని, బాధితులకు సుమారు 27 లక్షల పైచిలుకు ఆర్థిక సాయం చేశామన్నారు. వివిధ సమస్యలతో వచ్చిన బాధితులకు అండగా, పోక్సో కేసుల్లో మహిళలు, చిన్నారులకు సాంత్వన చేకూర్చడానికి, కౌన్సెలింగ్, రిహాబిలేషన్ సెంటర్‌గా భరోసా కేంద్రం దోహదపడుతుందన్నారు. ఈ సందర్భంగా భరోసా కేంద్రంలో మంత్రి మొక్కను నాటారు. కార్యక్రమంలో డీఐజీ రెమా రాజేశ్వరి, ఎస్పీ బాలస్వామి, డీఎంఅండ్‌హెచ్‌వో చందూ నాయక్, జిల్లా సంక్షేమాధికారిణి బ్రహ్మాజీ, మెదక్ తహసీల్దార్ శ్రీనివాసులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

