అనాజీపూర్‌లో పంటలకు చెరువు నీరు విడుదల.. హర్షం వ్యక్తం చేసిన రైతులు
పంటలకు నీరందించేందుకు గ్రామ సర్పంచ్ నిర్మల ఆధ్వర్యంలో శుక్రవారం చెరువు తూమును తెరిచి నీటిని విడుదల చేశారు.
రాయపోల్. అక్టోబర్ 09 : సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలం అనాజీపూర్ గ్రామ పరిధిలోని పెద్ద చెరువు ఆయకట్టు కింద సాగు చేస్తున్న వరి పంటలకు నీరందించేందుకు గ్రామ సర్పంచ్ నిర్మల ఆధ్వర్యంలో శుక్రవారం చెరువు తూమును తెరిచి నీటిని విడుదల చేశారు. చెరువు కింద సాగు చేస్తున్న వరి పంటలు నీటి కొరతతో ఎండిపోయే పరిస్థితి ఏర్పడటంతో స్పందించిన సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు, ఆయకట్టుదారులు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. వరి పంటకు కీలకమైన సమయంలో నీరు అందకపోతే దిగుబడిపై ప్రభావం పడే ప్రమాదం ఉండటంతో రైతులు ఆందోళన చెందారు.
ఈ నేపథ్యంలో సర్పంచ్ చొరవ తీసుకుని గ్రామస్తులు, వార్డు సభ్యులు, ఆయకట్టుదారులతో కలిసి పంట పొలాలకు నీరు విడుదల చేశారు. చెరువు నుంచి నీరు పొలాలకు చేరుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. సాగు సమయంలో పంటలకు నీరందించడం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. రైతుల సమస్యలను గుర్తించి సకాలంలో స్పందించిన సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులకు ఆయకట్టుదారులు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్!
Power cuts | మెదక్ జిల్లాలో కనీసం ఆరు గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదు : పద్మాదేవేందర్ రెడ్డ
Congress rule | కాంగ్రెస్ పాలనలో మళ్లీ అయిల్ ఇంజన్లు..! కన్నీళ్లతో సాగు చేస్తున్న రైతన్నలు
Smit Machchhar: పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ అవార్డు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

