మద్దూరు(ధూళిమిట్ట) : సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రం నుంచి ముస్త్యాల, రేబర్తి, లద్దునూరు గాగిల్లాపూర్, సలాకాపూర్ గ్రామాలకు వెళ్లే రోడ్లకు ఇరువైపులా ప్రమాదకరంగా మారిన చెట్లను గ్రామ సర్పంచ్ దామెర మల్లేశం ఆధ్వర్యంలో తొలగించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రోడ్లకు ఇరువైపులా చెట్లు వేపుగా పెరిగి ప్రమాదకరంగా మారడంతో వాహన చోదకులు ప్రమాదాల బారిన పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
వాహన చోదకులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని చెట్ల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మహ్మ షకీల్ అహ్మద్, పంచాయతీ కార్యదర్శి అశోక్, వార్డు సభ్యులు పిడిశెట్టి రేష్మ గౌరీష, అల్ద శ్రీకాంత్, ముక్క ప్రతిజ్ఞ కనకయ్య, మాజీ ఎంపిటిసి బూరుగు నరసింహులు గౌడ్, అహ్మద్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.