మద్దూరు ( ధూళిమిట్ట): సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని బైరాన్పల్లి ప్రాథమిక పాఠశాలలో మంగళవారం మండల విద్యాధికారి( ఎంఈఓ) కరుణాకర్ రెడ్డి ప్రీ ప్రైమరీ పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలల బలోపేతానికి ప్రీ ప్రైమరీ పాఠశాలలు తోడ్పడతాయని, గ్రామస్తులు ప్రీ ప్రైమరీ పాఠశాలలో పిల్లలను చేర్పించాలన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ బర్మ రాజమల్లయ్య, ఏఏపి చైర్ పర్సన్ రజిత, హెచ్ఎంలు మహేష్, యాదగిరి, పంచాయతీ సెక్రటరీ రాజు, ఉపాధ్యాయులు వివేక్, సురేష్, భవాని, ఆయా నవ్య, పిల్లల తల్లి దండ్రులు పాల్గొన్నారు.