ఓఆర్ఆర్ చుట్టూ రోడ్డు విస్తరణ పనులు
నగర ఔ టర్ రింగు రోడ్డుపై వాహనాల రాకపోకలు గణనీయంగా పెరిగాయి. పెరిగిన రద్దీకి అనుగుణంగా ఓఆర్ఆర్ చుట్టూ పలు చోట్ల విస్తరణ పనులు చేపట్టి మెరుగైన రవాణా సౌకర్యాల ను కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది
సిటీబ్యూరో, జనవరి 19 (నమస్తే తెలంగాణ): నగర ఔ టర్ రింగు రోడ్డుపై వాహనాల రాకపోకలు గణనీయంగా పెరిగాయి. పెరిగిన రద్దీకి అనుగుణంగా ఓఆర్ఆర్ చుట్టూ పలు చోట్ల విస్తరణ పనులు చేపట్టి మెరుగైన రవాణా సౌకర్యాల ను కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే ఐటీ కారిడార్ పరిధిలోని ఓఆర్ఆర్ చుట్టూ సర్వీ సు రోడ్లను 2నుంచి 4వరుసలకు విస్తరించే పనులు పురోగతిలో ఉన్నాయి. తాజాగా శంషాబాద్ ఓఆర్ఆర్ ఇంటర్ చేంజ్ వద్ద బెంగళూరు జాతీయ రహదారి వైపు ఉన్న తొండుపల్లి వద్ద కిందకు వెళ్లే రోడ్డును విస్తరించాలని నిర్ణయించారు.
రెండు వైపుల నుంచి వచ్చే భారీ వాహనాలతో పాటు, బెంగళూరు నుంచి వచ్చే వా హనాలు దిగేందుకు మూడు వరుసలు ఉన్న మార్గం సరిపోవ డం లేదు. దీన్ని ప్రస్తుత అవసరాలే కాకుండా, భవిష్యత్తులో పెరిగే ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకొని ఎగ్జిట్ మార్గాన్ని విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సుమారు 6.5గుంటల స్థలాన్ని భూసేకరణ ద్వారా సేకరించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఓఆర్ఆర్ ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్, భూసేకరణ అధికారి విస్తరణ పనులకు అవసరమై న భూమిని గుర్తించారు. త్వరలో భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయనున్నామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
- Tags
- circle
- Hyderabad
- ORR
- Road extension
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

