ప్రమాదవశాత్తూ నీట మునిగి వ్యక్తి మృతి
ప్రమాదవశాత్తూ నీట మునిగి ఓ వ్యక్తి మృతిచెందిన చెందిన సంఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని ఏడుపాయల చెక్ డ్యాం లో శుక్రవారం చోటు చేసుకుంది.
పాపన్నపేట : ప్రమాదవశాత్తూ నీట మునిగి ఓ వ్యక్తి మృతిచెందిన చెందిన సంఘటన మెదక్ జిల్లా ( Medak District ) పాపన్నపేట మండల పరిధిలోని ఏడుపాయల చెక్ డ్యాం ( Check dam ) లో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం ..
పాపన్నపేట గ్రామానికి చెందిన ఆకుల క్రిష్ణ(30) కూలీ పనులు చేస్తూ జీవితం గడుపుతున్నాడు. గురువారం రాత్రి ఏడుపాయల వద్ద ఉన్న తన తల్లి అంజమ్మ వద్దకు వెళ్లాడని, శుక్రవారం ఉదయం స్నానం చేసేందుకు ఏడుపాయల చెక్ డ్యాం వద్దకు వెళ్లి స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి గల్లంతయ్యాడని వివరించారు.
అక్కడే ఉన్న స్థానికులు గమనించి కుటుంబీకులకు, పోలీసులకు సమాచారం అందించారని తెలిపారు. గజ ఈతగాళ్ల సాయంతో గాలించి మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించామన్నారు. మృతుడి తల్లి అంజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రమాదవశాత్తూ నీట మునిగి వ్యక్తి మృతి
Alai-Balai | రాయపోల్‌లో అలయ్..బలయ్‌ని విజయవంతం చేయాలి
Depression | డిప్రెషన్‌కు అందరికీ ఒకేలాంటి చికిత్స పనిచేయదు.. అధ్యయనంలో వెల్లడి..
ఏనుగుల రాకేశ్‌రెడ్డి గెలుపునకు అంతా కృషి చేయాలి : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
MLC Dasoju Shravan Kumar | గ్రాడ్యుయేట్స్ నడుం బిగించి ముందుకు రావాలి : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

