Grain procurement | లారీల కొరతతో నిలిచిన ధాన్యం కొనుగోళ్లు
రామాయంపేట పీఏసీఎస్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి లారీల కొరత సమస్య తలెత్తింది.
నిజాంపేట,నవంబర్15 : మెదక్ జిల్లా నస్కల్లో రామాయంపేట పీఏసీఎస్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి లారీల కొరత సమస్య తలెత్తింది. ఈ సందర్భంగా స్థానిక రైతులు మాట్లాడుతూ వారం రోజులుగా లారీలు రాకపోవడంతో ఎక్కడి ధాన్యం అక్కడే ఉందని వ్యవసాయం చేయలంటేనే భయంగా ఉందన్నారు. మారుతున్న వాతవరణ పరిస్థితుల వల్ల వర్షం పడుతుందనే భయంతో కొంత మంది రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొనుగోలు కేంద్రానికి తరలించిన ధాన్యం ఎప్పుడో కొంటారో అనే భయంతో మరికొంత మంది రైతులు తమ ధాన్యాన్ని దళారులకు విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రానికి లారీలు వచ్చేలా…త్వరితగతిన కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. కార్యక్రమంలో రైతులు కుర్మ దుబ్బయ్య, రమేశ్, గుమ్ముల పర్శరాములు, మెట్టు నాంపల్లి, పాగల దుర్గయ్య తదితరులు ఉన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | కివీస్‌పై భారత్ సంచలన విజయం.. ఏడేళ్ల రికార్డు బద్దలు!
Dhanush | మమ్ముట్టిపై నా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది.. మెగాస్టార్‌పై ధనుష్ ప్రశంసలు!
Dear Astronaut | అంతరిక్షయాన కల నెరవేర్చేందుకు తండ్రి సాహసం.. ఆకట్టుకుంటున్న ‘డియర్ ఆస్ట్రోనాట్’ ట్రైలర్
Health tips | మీ డైట్లో బీట్రూట్ ఉంటే ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా..?
Panchayat elections | ఏపీలో తొలిదశ పంచాయతీ ఎన్నికలకు కొనసాగుతున్న నామినేషన్లు
ట్రెండింగ్ వార్తలు
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!

