మూసాపేట, జనవరి 8 : భూత్పూర్ మండలంలోని అన్నాసాగర్ గ్రామానికి మంగళవారం ఎమ్మెల్సీ కవిత రానున్నట్లు మూసాపేట జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్ సోమవారం ప్రకటనలో తెలిపారు. దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సోదరుడు ఆల శశివర్ధన్‌రెడ్డి ఈనెల 4వ తేదీన గుండెపోటుతో మృతి చెందిన విషయం విధితమే.
అందుకు ఆల వెంకటేశ్వర్‌రెడ్డితోపాటు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఎమ్మెల్సీ కవిత 9వ తేదీన ఉదయం 11గంటలకు వస్తున్నట్లు పేర్కొన్నారు.