గద్వాల, ఆగస్టు 18 : ఎగువ నుంచి అనుకున్న స్థాయిలో ప్రాజెక్టుకు వరద రాకపోవడంతో సోమవారం జూరాల గేట్లు మూసివేశారు. జూరాలకు ఎగువ నుంచి 32వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. జూరాల పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుత ం ప్రాజెక్టులో 318.20 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉంది.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్ర స్తుతం 9.009 టీఎంసీల నీరు ప్రా జెక్టులో నిల్వ ఉంది. విద్యుదుత్పత్తికి 25,996 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. ప్రాజెక్టుకు మొత్తం ఇన్ఫ్లో 32వేల కూసె క్కులు కాగా అవుట్ ఫ్లో 30,693 క్యూసెక్కులుగా నమోదైంది.