ఆరోగ్యమే మహాభాగ్యం
ఆరోగ్యమే మహాభాగ్యం..మానవుని శరీరం సహకరిస్తే ఏపనినైనా సులువుగా ఛేదించగలమని అందుకు యోగా ప్రతిఒక్కరి జీవితంలో భాగం కావాలని మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.
- యోగా ప్రతిఒక్కరి జీవితంలో భాగం కావాలి: మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్ అర్బన్, జూన్ 21 : ఆరోగ్యమే మహాభాగ్యం..మానవుని శరీరం సహకరిస్తే ఏపనినైనా సులువుగా ఛేదించగలమని అందుకు యోగా ప్రతిఒక్కరి జీవితంలో భాగం కావాలని మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో జిల్లా ప తంజలి యోగా సమితి-భారత స్వాభిమాన్ ట్రస్ట్ మహబూబ్‌నగర్ వారి ఆధ్వర్యంలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో యోగా కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా యోగా సాధకులతో కలిసి మాజీ మంత్రి వృక్షాసనం, వక్రాసనం, భస్త్రిక, కపాలాభాతి, అనులోమ వినులోమ, ప్రాణాయానం, సూర్యనమస్కారాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరోగ్యం, సమానత్వం, సహకార స్ఫూర్తి కేవలం యోగా ద్వారానే సాధ్యమైతుందని, దీనిని ప్రతినిత్యం అలవర్చుకొంటే పనిఒత్తిడిని కూడా అధిగమించవచ్చన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణలోనే మహబూబ్‌నగర్‌కు క్రీడా మైదానానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో రూ.9 కోట్లతో ఇండోర్ స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించినట్లు ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, కౌన్సిలర్లు రాంలక్ష్మణ్, అనంత్‌రెడ్డి, నాయకులు శివరాజ్, నవకాంత్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

