కౌకుంట్ల : హాస్టల్లో అనుమానాస్పద స్థితిలో ఓ యువతి మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం పేరూరుకు చెందిన కల్పన(18) హైదరాబాద్ షేక్‌పేటలోని ఓ లేడీస్ హాస్టల్లో ఉంటూ స్థానిక కాలేజీలో బీటెక్ చదువుతున్నది.
హాస్టల్లో భోజనం సరిగా పెట్టడం లేదని ప్రశ్నించినందుకు నిర్వాహకులు మందలించారని, మానసిక ఒత్తిడి వల్లే తన కుమార్తె చనిపోయిందని తండ్రి రామాంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.