నాగర్ కర్నూల్ : జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్రూమ్( Double Bedroom ) ల కేటాయింపు
గందరగోళంగా సాగింది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించిన రెండో వార్డులో ఆ వార్డుకు సంబంధించిన బీఆర్ఎస్ కౌన్సిలర్ ( BRS Councilor ) తిమ్మాజీపేట పాండు ( Pandu ) మాట్లాడేందుకు అవకాశం కల్పించకపోవడంతో రసాబస జరిగింది.

బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూంలో సౌకర్యాలు ఇంకా పూర్తిగా కల్పించలేదని, అప్పుడే ఏ విధంగా ఇండ్లను కేటాయిస్తారని పాండు ప్రశ్నించారు. దీంతో పోలీసులు అతన్ని పోలీస్ స్టేషన్కు తరలించడం చర్చాంశనీయంగా మారింది .
ముందుగా విడుదల చేసిన జాబితా ప్రకారంగా కాకుండా వారికి ఇష్టం వచ్చినట్లుగా, కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉన్న వార్డుల్లోనే ఎక్కువ శాతం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వచ్చేలా చేశారని లబ్ధిదారులు ఆరోపించారు. నెలరోజుల కింద జాబితాలో పేరు ఉన్న లబ్ధిదారుల పేర్లు డ్రా తీసే సమయంలో లేకపోవడంతో పలువురు లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. 30 ఏళ్ల నుంచి నాగర్ కర్నూల్ లో ఉంటున్న వారిని కాదని, బీహార్ ప్రాంతానికి చెందిన వారికి ఇండ్లు కేటాయింపు చేయడం దారుణమని అన్నారు.