శ్లో: అగుణస్య హతం రూపం
అశీలస్య హతం కులం
అసిద్ధేస్తు హతా విద్యా
అభోగేన హతం ధనః
భా: దుర్గుణాలు గలవాడు ఎంత అందగాడైనా వ్యర్థం. శీల సంపద లేనివారు ఎంత ఉన్నత కులంలో పుట్టినా దండుగే. ఎంత ఉన్నత విద్యలు చదివినా విద్య వల్ల పొందవలసిన జ్ఞానం రాకున్నా వ్యర్థం. అనుభవం లేని శ్రీమంతం ఎంత ఉన్నా వ్యర్థమే.
– టి.సుధాకరశర్మ