శ్లో: అతి దానాత్ బలిర్బద్ధో
హ్యతి మానాత్ సుయోధనః
వినష్టో రావణో లౌల్యాత్
అతి సర్వత్ర వర్జయేత్.
తా: అతిగా దానం చేయడానికి అలవాటుపడిన బలి చక్రవర్తి, అతిగా అభిమానధనుడైనందువల్ల దుర్యోధనుడు, అతిగా స్త్రీ లోలత వల్ల రావణుడు నష్టపోయారు. కనుక అతిని ఎల్లప్పుడూ వదిలించుకోవడమే శ్రేష్టం.
