కామారెడ్డి జిల్లా ప్రశస్తి
పాయకసఖ్యతన్ విపులభారతసంసృజనమ్మునందు, నా రాయణభట్టు నన్నయకు రంజిలు సాయమొనర్చెనన్నచో దాయనికీర్తి వాజ్మయపదమ్మగు ‘వాణసవాటి’గాదె? నే డాయపురూపకీర్తి గననయ్యెడు విశ్రుతకామరాట్పురిన్ !
పాయకసఖ్యతన్ విపులభారతసంసృజనమ్మునందు, నా
రాయణభట్టు నన్నయకు రంజిలు సాయమొనర్చెనన్నచో
దాయనికీర్తి వాజ్మయపదమ్మగు ‘వాణసవాటి’గాదె? నే
డాయపురూపకీర్తి గననయ్యెడు విశ్రుతకామరాట్పురిన్ !
అలరెను దోమకొండ, కవితామృతముల్ చిలికించు సత్కవుల్
వెలసిన వెండికొండ, వరవేదికపై కవిరాజు నిల్వగా
చెలగిన పైడికొండ, సువశీకృత సంస్కృతవాజ్మయమ్ముతో
నిలిచిన రాచకొండ, కమనీయచరిత్రకు మేటి కొండయౌ !
బిక్కనవోలు పున్నెములు విచ్చినచోటయి సిద్ధరాముడే
దిక్కుగనున్న దేవళము, తీర్చిన పండితపాళికాదృతిన్
మక్కువగొల్పగా నిలుపు మంగళధామము రాజధానియై
మ్రొక్కినవారికెల్లరికి పుణ్యములిచ్చుచునుండునెప్పుడున్ !
రథముల వైభవమ్మునకు రాజితధామము రామరెడ్డిలో
ప్రథితములైన రామశివ భైరవులాదిగ నెందరెందరో
కథలను నిండు దేవతలు కావ్యములల్లిన సత్కవీశ్వరుల్
శ్లథమది లేని కీర్తి, గొను జాతరలన్ వెలుగొందు నెప్పుడున్ !
కోటలకు రాటుదేలిన కూర్మి నింపి
మేటిచరితకు నిలయమై మంచి వెలుగు
కామరాట్టు రనామక కల్పవల్లి
జనులదీవించుచుండు ధరామతల్లి !
-డా.అయాచితం నటేశ్వరశర్మ
94404 68557
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
- Tags
- literature
- NT Kavithalu
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

