ఆవిష్కృతి
ఆమె ఉనికి కోసం మనుగడ కోసం కళ్లెం వేసి నియంత్రించిన కట్టుబాట్ల బంధనాలను తెంచుకొని తనను తాను ప్రతినిత్యం
ఆమె ఉనికి కోసం
మనుగడ కోసం
కళ్లెం వేసి నియంత్రించిన
కట్టుబాట్ల బంధనాలను
తెంచుకొని
తనను తాను ప్రతినిత్యం
చెక్కుకుంటూనే ఉంది
రెప్పల చాటున
దాగిన స్వప్నాల్ని
సహకారం చేసుకుంటూ
దిగంతాలను ఆవహించిన
శూన్యాన్ని ఛేదిస్తూ
ఖగోళ విస్ఫోటనమై
ప్రకంపిస్తూ
గగనతలానికి బాటలు వేసింది
ఆశయమే ఆలంబనగా
ఆలోచన సాగరమై
ప్రగతి రథ పగ్గాలు
చేతబూని
విజయ బావుటా ఎగురవేసింది
ఆటుపోటుల అగ్ని పరీక్షల
సాములో పునీతమై
అన్నిరంగాల్లో అభినివేశమై
ఆకాశమంతా తానై
తనను తాను సరికొత్తగా
ఆవిష్కరించుకుంటుంది!
– నెల్లుట్ల సునీత 79894 60657
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

