కొత్త గాలి గావాలె
మొస మర్లుత లేదు గోస తీరుత లేదు బిసలెన్ని తిప్పిన గని దిశ మారుత లేదు మాటలు కోటలు దాటుతానయి మీటలు ఒత్తుడు కాడ్నే ఆగుతానయి
మొస మర్లుత లేదు గోస తీరుత లేదు
బిసలెన్ని తిప్పిన గని దిశ మారుత లేదు
మాటలు కోటలు దాటుతానయి
మీటలు ఒత్తుడు కాడ్నే ఆగుతానయి
ట్రెడ్ మిల్ మీద ఎంత ఉరికిన గాని
దూరం తరుగుత లేదు
బిగించి ఎత్తిన పిడికిండ్లు ఒదలై
పగోని భుజాల మీద వాలుతానయి
బతుకమ్మలను ఎత్తిన శిరస్సులు
బానిసల్లెక్క వొంగి నిలబడుతున్నయి
రోడ్ల మీద వంటావార్పు చేసిన చేతులు
శత్రువుకు విందు భోజనాలు ఒడ్డిస్తాన్నయి
సాగర హారాలల్లిన బాహువులు
బుడ్డర్ ఖాన్లను భుజాలపై మోస్తాన్నయి
ధూంధాం పాటలు పాడిన నోర్లు
వైరి భజన కీర్తనల రాగమెత్తుకున్నయి
ధర్నాలెన్నో చేసిన ఆత్మగౌరవాలు
ధర్మాగ్రహాన్ని చూపెట్టుడు మరిశినయి
మిలియన్ మార్చ్ల ఉరికిన
మట్టి మనుషుల హస్తాలు
మనవి గాని విగ్రహాల కోసం
మట్టి పిసుకుతున్నయి
గాల్లె పానాలిడిశిన
పొల్లగాండ్ల కుటుంబాలు
గాలి గాలి తిరుగుతానయి
తల్లి దయ్యమైతె తొట్లె ఏడ కడ్తం
అమ్మ ఒండినయన్ని అయ్యే తింటుంటె
పొల్లగాండ్లకేం పెడ్తం
ఊరికి పొయ్యేటోన్ని ఉత్తగ ఇడిశిపెట్టి
ఏరుగపొయ్యేటోనికి సద్ది కడుతుంటె
ఏమి జెయ్యలేక ఎడ్డి మొకాలేస్తున్నం
తెలంగాణ గడ్డ మీద గద్దలాడుతున్నయి
సయిమం పడ్డప్పుడు కాటేస్తె మాయె గని
గందాక బుసనన్న కొట్టొద్దా?
వలస కంపు పవనాలు
వద్దన్నా కొట్టుకొస్తుంటే
తంగేడు పూల వాసన తడాఖ చూపొద్దా?
-నెల్లుట్ల రమాదేవి
9440622781
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

