యుద్ధోన్మాదం
పరస్పర హృదయ వైషమ్యాల నడుమ విస్తృతమైన భావజాల దురాగతం ‘నేను’ను కాంక్షిస్తూ కాగుతూనో అధికారదర్పాన్ని వేలాడదీసుకునో పర్యవసాన ఫలితాలను శూన్యంలోకి ఎగదోస్తూ ప్రకటితమయ్యే యుద్ధోన్మాదం.
పరస్పర హృదయ వైషమ్యాల నడుమ
విస్తృతమైన భావజాల దురాగతం
‘నేను’ను కాంక్షిస్తూ కాగుతూనో
అధికారదర్పాన్ని వేలాడదీసుకునో
పర్యవసాన ఫలితాలను
శూన్యంలోకి ఎగదోస్తూ
ప్రకటితమయ్యే యుద్ధోన్మాదం
అదేమిటన్న ప్రశ్న అంకురించకుండానే
గాలిని చేరే నిస్సహాయ ఊపిరులు,
దిక్కుదిక్కునా విసిరివేయబడిన
ఖండిత భాగాల కల్లోలాలు
బతుకు అర్థం మారి ముక్కలవుతూ
బతికడమెందుకన్న ఆక్రోశం
కన్నుల్లో శరాఘాతమై తగిలి
కన్నీటి కొండ పగిలి ప్రవహిస్తోంది
ఇది గత చరిత్ర పుటలపై
మరోమారు ముద్రించిన మరక అంటూ
పేజీ తిప్పి సర్దుకొని పోవడమేనా?
దుర్నీతి దారుల గమనంలో
కాలాన్ని కర్కశంగా మారుస్తూ
చిరునవ్వుల పసితనాన్ని సైతం
కొల్లగొడుతున్న ఆగడాలకు
కరగని శిలా హృదయ ప్రభుత్వాలు
నియంత్రించలేని శాంతి సంస్థలు
అమానవీయ నైజంతో
ప్రపంచాన్ని విషంగా మార్చే ఓ మనిషీ!
కోర్కెల మాయోపాయాలెన్నైనా
ఈ జీవనాటకంలో నీ పాత్ర
నూరేళ్లకు మించదన్న సత్యాన్ని మరిచావా?
-ధూళిపాళ అరుణ
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

