దృశ్యం పునరావృతం!
తెలంగాణ ఎద మీద కలుపుమొక్కల్లా పరాయి విగ్రహాలు మొలుస్తున్నాయి తుది దశ ఉద్యమమేదో మిగిలే ఉందని గుర్తు చేస్తున్నాయి!
తెలంగాణ ఎద మీద కలుపుమొక్కల్లా
పరాయి విగ్రహాలు మొలుస్తున్నాయి
తుది దశ ఉద్యమమేదో
మిగిలే ఉందని గుర్తు చేస్తున్నాయి!
ఒక విమోచనం ఒక సుదీర్ఘ విముక్తి
నిద్ర లేపిన ఆత్మగౌరవ ప్రతీక
ఎవరి ఊహకందని
సకల జనుల పోరాటం
వెక్కిరింపులకు లోనవుతున్నవి!
చెప్పినా విననందుకు
ఊహించని దృశ్యమొకటి
నిత్యం పునరావృతమవుతున్నది
తెరవెనుక బాగోతమొకటి
సరిహద్దు శత్రుదళాల్లా కవ్విస్తున్నాయి!
భౌగోళిక విడిపోతకు
విద్వేషపు పూత పూస్తున్నారు
తరం మారుతున్నది
మహాత్ముడు దిగివచ్చి చెప్పినా
ఇప్పటి కవ్వింపులకు
శాంతిమంత్రం పనిచేయకపోవచ్చు!
ముగింపు తెలియని
యుద్ధం మొదలు పెట్టొద్దు
విధ్వంసానికి పునాదులు తీయొద్దు!
ఒక అర్భకుడికి ఎక్కడా
తెలంగాణ పదమే కనపడలేదట
అతనిప్పుడు ఏ ప్రాంతానికి అధ్యక్షుడు?!
మోచేతి నీళ్లకు మరిగినవాళ్లను
చరిత్ర ఎన్నడూ క్షమించదు!
యోధుల్లారా!
కొత్త తరాన్ని నిద్రలేపండి
అధికారమే పరమావధి కాదు
ఆత్మగౌరవానికి భంగం రానీయకండి!
ద్రోహులు మనవాళ్లే అయితే
పాతర పెట్టేందుకు
కాళోజీ సాక్షిగా
సమాధులు తవ్వండి
తుది దశ ఉద్యమానికి
మరోసారి వాకిళ్లు తెరవండి!!
-కోట్ల వెంకటేశ్వరరెడ్డి
9440233261
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

