కాలననింద కూడదు!
ఇంటికి మిత్రులు వస్తే గాలి పూల పరిమళాన్ని మోసుకొచ్చినట్టు ఉండేది!
ఇంటికి మిత్రులు వస్తే
గాలి పూల పరిమళాన్ని
మోసుకొచ్చినట్టు ఉండేది!
రోజు మాట్లాడుకునే మాటలే ఎదురెదురుగా కూర్చుని ముచ్చట్లు
రాల్చుకోవడం ఓ వింత కాంతి!
వాళ్లు వెళ్తూ వెళ్తూ
మళ్లీ ఎప్పుడు అంటారు ఎవరో ఒకరు
వెంటనే జవాబు దొరకదు!
మితృత్వం కూడా
ఒక చిక్కని పాటనే
ఎన్నిసార్లు విడిపోయినా పలుచబడదు!
సుదీర్ఘ అనుభవాలు
ఇప్పుడు ఎవరికి కావాలి
గూగుల్ ఒక మాయా దర్పణం!
మనిషి కోసం
తపించే కాలం రాకముందే
మలిసంధ్య కాంతిలో లీనమైతే బాగుండు
బొటా బొటి సంపాదనతో
ఎంత నిర్మలంగా ఉండేవాళ్లం
కాసు రాక్షసి మానవత్వాన్ని కబళిస్తున్నది
తల్లిని కొడుకు చంపడం
భార్య భర్తను చంపడం
ఎవరు కలగన్నారు ఇక్కడ?!
అక్రమ సంబంధాలకు
చట్టభద్రత దొరికాక
కాలాన్ని నిందించి లాభం లేదు!
రాకపోకలకు
స్పందన కరువైన చోట
నిశ్శబ్దంగా నిష్క్రమించడమే మేలు!!
– కోట్ల వెంకటేశ్వరరెడ్డి 94402 33261
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

