అమర దీపం
మర్రిచెట్టు దగ్గర అందరూ ఒక్కసారి తెలంగాణ యుద్ధ్దగీతం పాట పాడుతున్నట్లుంది మండే డప్పులమీద జజ్జనకరె దరువులతో పోషవ్వకాడ కర్రసాము స్తున్నట్లుంది
మర్రిచెట్టు దగ్గర అందరూ ఒక్కసారి తెలంగాణ
యుద్ధ్దగీతం పాట పాడుతున్నట్లుంది
మండే డప్పులమీద జజ్జనకరె దరువులతో
పోషవ్వకాడ కర్రసాము చేస్తున్నట్లుంది
ముచ్చట్లతో నక్షత్రాలు ముగ్గుల్ని పెడుతున్నట్టుంది
ఆకాశము నేలదిగి అమర స్మృతిలో
కవి సమ్మేళనం జరుపుతున్నట్లుంది
పొన్నపూలు కాశపూలు మందారం పూలు
మోదుగు పూలు వేపపూలు వేగుచుక్కలు
ప్రత్యేక కలలకై ఆశయాలకై గుండెను రాసిచ్చినోళ్ళు
ఎహే ఇంకెన్నాళ్లు ఇంకెంతమందిమీ
ఇవన్నీకాదు గాని ఎంతమందిమి కావాలనో ఒక్కసారే
తీసుకొండ్రని తమ విలువైన ప్రాణాలను
మట్టికి ఆర్పించుకున్న బంతిపూలు
ఎర్రమట్టిలో పూసిన గగ్గరి పూలు
నల్లభూముల్లో పూసిన కనకాంబరాలు
ఎడారుల్లో పూసిన నల్లాలం పూలు
పల్లె వాకిట్లో పూసిన ఎర్రగులాబీలు
ఆశయసాధనకై ఎత్తిన జెండా దించని బీరపూలు
నేలను విముక్తి చేసిన గడ్డిపూలు
నిరసనలతో నెగళ్ళని మండించిన ఇప్పపూలు
తరతరాల బానిసత్వానికి చరమగీతం పాడిన
కటిక పూలు కట్లపూల కదనజ్యోతులు
వలసవాదాన్ని సవాలుచేసిన యుద్ధపూలు..
ఆకుపచ్చ రక్తంకోసం ఎర్రరక్తాన్ని
త్యాగం చేసిన ఎర్రెర్రని పూలు
గండశిలల్ని కరిగించిన త్యాగాల తంగేడు పూలు
వీరులు ఉదయిస్తారు పొద్దున పోకపూలలా
ఇప్పుడు మాచరిత్రపేజీల నిండా మీరే
మా కొత్త బతుకులకు ఊపిరిమీరు
మా తోవలకు వెలుగుపూలు మీరు
మా స్వేచ్ఛావాదానికి సిపాయిలు మీరు
మా పండుగలకు మీరే దేవుళ్ళు
మిమ్మల్ని యాదిచేసుకోవడమంటే
మా అమ్మ నాయినలను యాదిచేసుకోవడమే!
మొక్కవోని ధైర్యాలు ఉక్కుసంకల్పాలు
పాతుకుపోయిన ఆధిపత్యాలను ఎదిరించి
ధిక్కార ధ్వజమై నిలిచిన వెదురుపూలు
అంతరాలెన్నున్నా
మనసులలో బంగారు వెలుగు పూస్తున్నట్లు
మన అమరజ్యోతి ప్రపంచ సూర్య కాంతి
మహా సంకల్పం చారిత్రాత్మకం
-వనపట్ల సుబ్బయ్య
9492765358
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

