చెట్టంత ఎదిగిన ఓ మనిషి
చెట్టంత ఎదిగిన ఓ మనిషి చెట్టంటే నీకెందుకు జలసి చెట్టులేని బతుకు లేదని తెలిసి బతకబోకు బాధ్యత నువు మరిచి
పల్లవి: చెట్టంత ఎదిగిన ఓ మనిషి
చెట్టంటే నీకెందుకు జలసి
చెట్టులేని బతుకు లేదని తెలిసి
బతకబోకు బాధ్యత నువు మరిచి
అను పల్లవి: చెట్టే జీవితము లేకుంటె శూన్యము
పెట్టు నువ్వొక చెట్టు తోడుంటది ఒట్టు ॥చెట్టంత॥
చరణం: నవ మాసాలు మోసి కన్నది నీ తల్లి
ప్రాణవాయువిచ్చి పెంచెను చెట్టు తల్లి
జన్మనిచ్చిన అమ్మ దైవమై కొలువుంది
జగతిని ఆడించె చెట్టు దయ్యమెందుకౌతోంది
చెట్టూ అమ్మే కదా..
(నువ్వు) ఆ అమ్మ బిడ్డవె కదా…
పెట్టు నువ్వొక చెట్టు ఫలముంటది ఒట్టు ॥చెట్టంత॥
చరణం: తినె తిండొక చెట్టు కట్టు బట్టొక చెట్టు
కడదాకా చెట్టు తోడుంటది ఒట్టు
పొట్ట బట్ట చట్టైతే పట్టదెందుకు చెట్టంటే
ప్రగతికదే మట్టైతే గిట్టదెందుకు చెట్టంటే
చెట్టుకు బతుకునిస్తె..
మనకది బతుకిస్తది…
పెట్టు నువ్వొక చెట్టు ఆసరౌతది ఒట్టు ॥చెట్టంత॥
చరణం: నీ కట్టెలో ప్రాణం ఉన్నంత కాలం
కట్టె నీకవసరమె అది తెలిసిన నిజమే
కట్టెల్లో బతికె కట్టె కట్టెల్లో కాలే కట్టె
కట్టెలిచ్చె చెట్టంటే పట్టదెందుకు నీ కట్టెకు
ప్రాణమున్న కట్టెవైతె..
కట్టె నీ ప్రాణమైతె…
పెట్టు నువ్వొక చెట్టు సంరక్షణ చేపట్టు ॥చెట్టంత॥
-ఆరుట్ల నరేశ్, 94409 91345
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

