వసంతగానం
కన్ను తెరిచి చూడాలనుకున్నా రెప్ప లేవటం లేదు దృశ్యాలు కనుమరుగవుతున్నాయి
కన్ను తెరిచి చూడాలనుకున్నా
రెప్ప లేవటం లేదు
దృశ్యాలు కనుమరుగవుతున్నాయి
పథకం మాట్లాడుతే బాగుండేది
సరియైనదో కాదో తెలిసేది
ఒంటరితనాలు అంటరానితనాలు
నియంతృత్వం శాసించే ఏకత్వాలు !
ఆలోచించే మెదళ్లను బంధించి
ప్రశ్నించేవారి గొంతులు నులిమేసి
నిరాయుధీకరణ
నిస్సాయతీకరణ
మనిషిని కుంగదీస్తుంది
మనిషిని మనిషిగా చూడని
మానవత్వపు విలువలకు తావులేదు
ఇన్నాళ్లూ లేని ఇవ్వాళ్ల ఆ మోములో
కాంతిని చూస్తున్నాను !
అదొక ఆణిముత్యమని
తోడుగా వజ్రాన్ని చెక్కాను !
అదొక గొప్ప నేర్పరని
ఓర్పుతో విలువిద్య అప్పజెప్పాను !
ఏది గురిచూసి పెడుతుందో
అదో గొప్ప విద్య !
ధ్యానం అధ్వాన్నం కాకూడదు !
నిష్ట అప్రతిష్ట పాలు పడకూడదు !
కంటి చూపు బాణమవ్వాలి!
సారించిన అస్ర్తాలన్నీ
సంధించటానికి సిద్ధమవ్వాలి !
చిట్ట చివరగా చెబుతున్నా-
దానిలో మోడును చూడలేను
అది వసంత మవ్వాలి !
శాఖోపశాఖలుగా విస్తరించి
వృక్షాలుగా విరబూసే
ఆకాశానికంటుతున్న అరణ్యమవ్వాలి!!
-కందుకూరి శ్రీరాములు
9440119245
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకుడిపై కేసు నమోదు
FMG Doctor | రాజస్థాన్‌లో 15 రోజుల్లోనే జీవో పాసైంది.. మన దగ్గరే ఎందుకు ఆలస్యం..?: కాంగ్రెస్ సర్కార్‌పై ఎఫ్ఎంజీ డాక్టర్ ఫైర్
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

