జిర్కాన్.. వజ్రాన్ని పోలి ఉంటుంది. కానీ వజ్రం కాదు. అయితేనేం, తళుకుల విషయంలో తారలతో పోటీపడుతుంది. అందుకే మగువలు జిర్కాన్ ఆభరణాలు ధరించాలనికోరుకుంటారు. ఫొటోలో మాడల్ మెడలో మెరిసిపోతున్నదీ, చెవులకు వేలాడుతున్నదీ జిర్కాన్ జోడించిన నగలే.
వైవిధ్యం కోసం పూసలనూ వాడారు. ఆభరణాల తయారీకి రాగిని ఎంచుకున్నారు. ట్రెండీగా ఉండాలని బ్లాక్ పాలిష్ కూడా చేశారు.