పరిమళమే పరమౌషధం
హాయిగొలిపే పరిమళానికి మది పరవశిస్తుంది. కమ్మని వాసన ముక్కుకు తగిలితే కడుపులో ఆకలి రగులుతుంది. అగరు ధూపానికి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. అంతా పరిమళాల మాయ!
హాయిగొలిపే పరిమళానికి మది పరవశిస్తుంది. కమ్మని వాసన ముక్కుకు తగిలితే కడుపులో ఆకలి రగులుతుంది. అగరు ధూపానికి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. అంతా పరిమళాల మాయ! మనసుకు ఉల్లాసం కలిగించటం దగ్గర్నుంచి ఒత్తిడిని తగ్గించటం వరకూ పరిమళాలు చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటి ప్రాధాన్యాన్ని వైద్యులు ఏనాడో పసిగట్టారు. మనసుకూ శరీరానికీ అవినాభావ సంబంధముందని కనుగొన్నారు. ఇది క్రమంగా ప్రత్యేక పరిమళ చికిత్స (అరోమా థెరపీ)గా అవతరించింది.
జలుబు చేస్తే వేడి నీటిలో పసుపు, వేపాకు వేసి ఆవిరి పడతాం. వామును వేడిచేసి వస్త్రంలో చుట్టి పీలుస్తాం. ఇవన్నీ పరిమిళ చికిత్సలే. సహజ చికిత్సలుగా మనకు తెలియకుండానే అనాదినుంచీ వాడుతూ వస్తున్నవే. పరిమళ చికిత్స చాలా ప్రాచీనమైనది. సంప్రదాయ, ఆయుర్వేద వైద్యులు పరిమళ ద్రవ్యాల నూనెలతో మర్దన చేయటం వంటివి పాటిస్తూనే వచ్చారు. పరిమళ చికిత్సలో చాలా రకాలున్నాయి. ప్రధానంగా నూనెలతో వాసన పీల్చడం, మర్దన, స్నానం మొదలైనవి. ఇంట్లో పరిమళం కోసమే అయితే ఆవిరి పాత్ర (డిఫ్యూజర్)లో వేసి వాడుకోవచ్చు. చికిత్సగా అయితే మాత్రం నిపుణుల సలహాతోనే వాడాలి. సొంత ప్రయోగాలు చేయొద్దు.
- ఒత్తిడితో తలెత్తే దుష్ప్రభావాలు తగ్గటానికి లావెండర్, గులాబీ, కేమోమిలే పరిమళాలు ఎంతగానో ఉపయోగపడతాయి. లావెండర్ నూనెను నీటిలో కలిపి దిండు మీద చల్లుకుంటే నిద్ర బాగా పట్టడానికి తోడ్పడుతుంది.
- పచౌలీ పరిమళం బాధలు తగ్గుముఖం పట్టడానికి, మూడ్ను మెరుగుపరచటానికి దోహదం చేస్తుంది.
- నిమ్మగడ్డి, మల్లె, గులాబీ, లావెండర్ నూనెల వంటివి విషతుల్యాలనూ తొలగిస్తాయి. వీటిని నిపుణుల సలహా మేరకు కొద్దిగా టీలో కలిపి లోపలికీ తీసుకోవచ్చు.
- జలుబు చేసినప్పుడు వేడి నీటిలో యూకలిప్టస్ నూనెను కలిపి ఆవిరి పట్టొచ్చు. తులసి పరిమళంతో ఆవిరి పడితే జలుబు, జ్వరం తగ్గటానికి దోహదం చేస్తుంది. తలనొప్పితో బాధపడుతుంటే లావెండర్, యూకలిప్టస్ నూనెల ఆవిరి పట్టొచ్చు. నీటిలో కాస్త లావెండర్ లేదా జెరీనియం నూనె కలిపి.. అందులో చిన్న రుమాలును తడిపి తల, మెడ మీద వేసుకున్నా తలనొప్పి తగ్గుతుంది.
- కెమోమిలా, జెరీనియం, మల్లె, లావెండర్, నరోలీ, పచోలీ పరిమళాలు మానసిక ప్రశాంతతకు ఉపయోగపడతాయి.
- ఆందోళన తగ్గటానికి నరోలీ నూనె బాగా ఉపయోగపడుతుంది. దీంతో తల మర్దన చేసుకున్నా, నీటిలో కలిపి స్నానం చేసినా మంచి ఫలితం కనిపిస్తుంది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

