అతివ అందాన్ని వర్ణించాలంటే కుసుమాలను సీన్లోకి తేవాల్సిందే! నయనాలను కమలాలతో పోల్చి ఆపేస్తే ఎలా.. సంపెంగ బెంగ పెట్టుకోదూ! విరులన్నిటితో సామ్యం చెబుతూ ఇంతిని ఎంత పొగిడినా కొంత మిగిలే ఉంటుంది. ఆ కొస‘మెరుపు’ను మరిపించే సౌందర్యం గులాబీనే! అందుకే, రోజా పువ్వన్నా, గులాబీ రంగన్నా.. మగువలకు వలపే! అచ్చంగా అలాంటి గులాబీ వన్నె పెప్లమ్ టాప్, గరారా కుర్తా ధరించి బాలీవుడ్ భామ వాణీ కపూర్ కమాల్ చేసింది. రిధి మెహ్రా సరికొత్తగా రూపొందించిన నాజమ్ కలెక్షన్లో వాణి ఇలా గులాబీ పువ్వులా తళుకులీనింది. ఆమెను చూస్తుంటే.. అందానికి కొత్త నిర్వచనం చెప్పినట్టు లేదూ!