Exercise Tips | రోజువారీ వ్యాయామంలో ఇబ్బందులా? ఈ చిట్కాలు మీకోసమే..!
చాలా మందికి వ్యాయామం చేయలాంటే బద్దకం. వ్యాయామ దినచర్యను ప్రారంభించడం ఎందరికో సమస్యగా ఉంటుంది. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా రోజువారీ వ్యాయామంలో ఇబ్బందులను పారదోలేందుకు వీలుంటుంది.
ప్రస్తుత ఆధునిక జీవితంలో శారీరక శ్రమ కరువై పోతుంది. ఫలితంగా ఎన్నో వ్యాధులు మనల్ని చుట్టుముడుతున్నాయి. వీలున్నవారు జిమ్గానీ, మరో ప్రాంతానికి గానీ వెళ్లి వ్యాయామం చేయాలి. అలా కుదరని వారు ఇంటిపట్టునే చిన్నచిన్న వ్యాయామాలు చేయడం అలవర్చుకోవాలి. చాలా మందికి వ్యాయామం చేయలాంటే బద్దకం. వ్యాయామ దినచర్యను ప్రారంభించడం ఎందరికో సమస్యగా ఉంటుంది. అయితే, ఒకసారి అలవాటు చేసుకుంటే మంచి ఆరోగ్యానికి మార్గం తెరుచుకుంటుంది. ఈ అలవాటు మన శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా రోజువారీ వ్యాయామంలో ఇబ్బందులను పారదోలేందుకు వీలుంటుంది.
అమెరికన్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం…
- గుండె ఆరోగ్యానికి రోజువారీ వ్యాయామం అవసరం. నిత్యం వ్యాయామం చేసేవారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
- రెగ్యులర్ వ్యాయామంతో శరీరం బరువు పెరుగకుండా చూసుకోవచ్చు. వివిధ వ్యాధులకు మూలకారణమైన ఊబకాయం నుంచి బయటపడటంలో వ్యాయామం సహకరిస్తుంది.
- రక్తంలోని గ్లూకోజ్, ఇన్సులిన్ స్థాయిలను సరైన మోతాదుల్లో ఉంచడంలో వ్యాయామం సహాయపడుతుంది. ఇది టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
- వ్యాయామం చేయడం వల్ల శరీరం ఫ్లెక్సిబుల్‌గా మారుతుంది. కండరాలు, ఎముకలు బలపడతాయి.
- ఆందోళనను దూరం చేయడంలో రోజువారీ వ్యాయామం ప్రభావవంతంగా ఉంటుంది. ఇది మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది. అలాగే, మానసిక స్థితిని మెరుగుపరిచే రసాయనాలు విడుదలయ్యేలా చేస్తాయి. ఈ హార్మోన్లు మనల్ని సంతోషంగా, ఆశాజనకంగా ఉంచుతాయి.
- వ్యాయామం చేయడం వల్ల చక్కటి నిద్రను సొంతం చేసుకోవచ్చు.
- మెరుగైన శారీరక, మానసిక ఆరోగ్యంతో ఎక్కువ కాలం జీవించవచ్చు.
సరైన వ్యాయామ దినచర్యను ఎంచుకోండి..

వ్యాయామం మొదులుపెట్టినప్పుడు ఏదైనా చేయాలనే ఒత్తిడిలో శరీరాన్ని ఉంచవద్దు. నచ్చిన వ్యాయామం చేయండి. దీని కోసం జిమ్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే యోగా వంటివి కూడా చేయవచ్చు. ఎల్లప్పుడూ సౌకర్యవంతంగా, ఆనందించే వ్యాయామాన్ని ఎంచుకోవాలి. అప్పుడే ఎక్కువ సమయం పాటు ప్రతిరోజూ చేయగలుగుతారు.
తక్కువ వ్యాయామంతో ప్రారంభించండి..

ఏదైనా అలవాటు కావడానికి 3 నుంచి 4 వారాల సమయం పడుతుంది. అందుకే మొదటి రోజు గంటసేపు వ్యాయామం చేస్తే రెండో రోజు నుంచి చేయనందుకు మనసులో సాకులు రావడం మొదలవుతాయి. 5-10 నిమిషాల వ్యాయామంతో వ్యాయామ దినచర్యను ప్రారంభించండి. ఇది అలవాటు కావడానికి శరీరానికి సమయం ఇవ్వండి. ప్రతి వారం మెల్లమెల్లగా ఈ సమయాన్ని పెంచాలి.
చిన్న లక్ష్యాలను సెట్ చేయండి..

పెద్ద లక్ష్యాన్ని సాధించడానికి చిన్న లక్ష్యాలుగా విభజించుకోవడం అవసరం. నెలలో ఏకంగా 30 కిలోల బరువు ఎవరూ తగ్గలేరు. రొటీన్ వ్యాయామం ప్రకారం నిజంగా కోల్పోయే బరువుపై దృష్టి పెట్టండి. చిన్న చిన్న లక్ష్యాలను సాధించడం ద్వారా స్ఫూర్తి పొందవచ్చు.
బరువుపైనే దృష్టి పెట్టొద్దు..

లక్ష్యం శరీరం బరువు తగ్గడం మాత్రమే కాదు. ఆరోగ్యంగా మార్చుకోవడం అనేది మరువొద్దు. అందుకని శరీరం బరువు తగ్గించుకోవాలని ఉబలాట పడకండి. మెరుగైన మానసిక ఆరోగ్యం, కండరాల పెరుగుదల వంటి వాటిపై కూడా దృష్టి పెట్టండి.
వ్యాయామాలను కూడా దాటవేయండి..

వారానికి ఏడు రోజులు వ్యాయామ దినచర్యను అనుసరించడం అనేది ముఖ్యం కాదు. వారంరోజులు వ్యాయామం చేయడం వల్ల శరీరం, మనస్సును అలసిపోతుంది. అలాకాకుండా వారంలో ఒకటి, రెండు రోజులు విశ్రాంతి తీసుకుని, అదే ప్రేరణతో తిరిగి వ్యాయామం చేయడం ప్రారంభించాలి. రోజుకు ఐదు నిమిషాల పాటు దాటవేయడమో లేదా ఎక్కువ చేయడమో అలవాటు చేసుకోవడం మంచిదంటున్నారు వ్యాయామ నిపుణులు
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

