ఎండ మండిపోతున్నా బండెక్కి బయటికి వెళ్లక తప్పదు. టన్ టనా టన్… అంటూ ట్యాన్ మన వెంటే రాకా తప్పదు. వచ్చినదాన్ని పోగొట్టేందుకు ఆలుగడ్డలు, టమాటాల సాయం తీసుకొమ్మంటున్నారు బ్యూటీ స్పెషలిస్టులు.
బొప్పాయి పండు గుజ్జులో తేనె కలిపి మాస్క్‌లా వేసుకోవాలి. బొప్పాయిలోని పపైన్ అనే ఎంజైమ్ ఎండ వల్ల ఏర్పడ్డ నలుపు రంగును తొలగించడానికి సాయపడుతుంది. తేనె సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.
కలబంద గుజ్జును తీసి ట్యాన్ అయిన ప్రదేశంలో పూతలా రాయాలి. ఇందులో ఉండే యాంటీబ్యాక్టీరియల్ గుణాలు చర్మానికి సాంత్వన కలిగించి, తేమను నిలిపి ఉంచేందుకు తోడ్పడతాయి. దీంతోపాటు ఎండవల్ల కమిలిన చర్మాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ఉపకరిస్తాయి.
ట్యాన్‌ను తొలగించడంలో టమాటా అద్భుతంగా పనిచేస్తుంది. టమాటాను వెడల్పాటి ముక్కలా తరిగి ఎండవల్ల కమిలిన చర్మం మీద రుద్దితే అది ముందటి రంగును సంతరించుకుంటుంది. టమాటా గుజ్జు కూడా ప్రయత్నించవచ్చు.
ఆలుగడ్డ రసాన్ని చర్మానికి పట్టించి కడిగినా మంచి ఫలితం ఉంటుంది. ఇందులోని సహజ బ్లీచింగ్ గుణాలు ట్యాన్‌ను మాయం చేస్తాయి.