నవ్వు.. నవ్వించు.. ఆరోగ్యంగా జీవించు..
నవ్వు .. మనకు ప్రశాంతతను కల్పిస్తుంది. మన ఆరోగ్యం విషయంలో ఓ దివ్యౌషధంలా పనిచేస్తుంది. నవ్వు అనేక వ్యాధులను దూరం చేసే మంచి టానిక్ లాంటిది. దీనిని మించిన వ్యాయామం మరోటి లేదని చెప్పాలి....
నవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం.. నవ్వలేకపోవడం ఒక రోగం అన్నాడో సినీ కవి. ఈ సృష్టిలో ఉన్న జీవులన్నింటిలో హాయిగా నవ్వగలిగే వరం ఒక్క మనిషికే సొంతం. నిజమే, కానీ, నవ్వుకు దూరమవుతున్న వాళ్ల సంఖ్యే ఎక్కువగా ఉంటున్నారు. ఇవాల్టి యాంత్రిక జీవనంలో మనిషి నవ్వడం మరిచిపోతుండటం విషాదకరం.
మీకు మీరుగా ఓ ప్రశ్న వేసుకోండి.. ‘మీరు మనసారా నవ్వి ఎన్నిరోజులైంది?’.. కడుపుబ్బా నవ్వి కళ్లలో నీరు కనిపించి ఎన్నాళ్లయిందో కదూ. నిజం చెప్పండి. మనస్పూర్తిగా, హాయిగా నవ్వుకోలేకపోతున్నామని బాధపడుతున్నారు కదూ..! నవ్వు .. మనకు ప్రశాంతతను కల్పిస్తుంది. మన ఆరోగ్యం విషయంలో ఓ దివ్యౌషధంలా పనిచేస్తుంది. నవ్వు అనేక వ్యాధులను దూరం చేసే మంచి టానిక్ లాంటిది. దీనిని మించిన వ్యాయామం మరోటి లేదని చెప్పాలి. నవ్వుతూ ఉండటం వల్ల దినమంతా మనం ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతూ మన పనుల్లో మరింత ఉత్పాదకత చూపించొచ్చు.
నవ్వడం వలన మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి. నవ్వు మనకు మంచి అనుభూతిని కలిగించడమే కాకుండా మన మానసిక ఆరోగ్యం, రోగనిరోధక వ్యవస్థ, రక్తనాళాల పనితీరును కూడా మెరుగుపరుస్తుందని తేలింది. నవ్వు ఒత్తిడి యొక్క అనేక ప్రతికూల లక్షణాలను తగ్గిస్తుంది. నవ్వినప్పుడు మన శరీరం ఎండార్ఫిన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇది మంచి అనుభూతిని కలిగించే హార్మోన్లు. ఈ హార్మోన్లు ఉత్పత్తి కావడం వలన మనలో ప్రతికూల భావోద్వేగాలు దూరం అవుతాయి. నవ్వు మన గుండె ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందని పలు అధ్యయనాలు తేల్చాయి. గుండెను ఆరోగ్యంగా చూసుకోవడానికి నవ్వు ఒక సులభమైన మార్గమని వైద్యులు కూడా సెలవిస్తున్నారు. నవ్వాలంటే మన జీవనశైలిలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదు. మన జీవితంలో ఆనందపు కాంతులను వెదజల్లడానికి ప్రేరేపిస్తుందని చెప్పడంలో ఎలాంటి ఔచిత్యం లేదు.
నవ్వుతో ఎన్ని లాభాలో..
- నవ్వు మన శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుతుంది. శరీరంలో శ్వాస వ్యాయామానికి నవ్వు ఒక మార్గం. ఊపిరితిత్తుల సామర్ధ్యం మెరుగయ్యేలా చేస్తుంది. రోజంతా మనల్ని శక్తివంతంగా ఉంచుతుంది.
- నవ్వే వారిలో రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. లాఫింగ్ థెరపీ వల్ల నొప్పిని తగ్గించవచ్చు. మీరు 10 నిమిషాలు చిరునవ్వుతో ఉంటే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
- గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది. మెరుగైన వాస్క్యులర్ పనితీరు ఉండేలా చేస్తుంది. రక్తప్రసరణ తగినంతగా ఉంటే గుండె సాధారణ లయతో కొట్టుకుంటుంది.
- నవ్వు మన శరీరం బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసోల్ ఎక్కువ మొత్తంలో విడుదల కాకుండా చూస్తుంది. ఎక్కువగా నవ్వడం వలన క్యాలరీలు బర్న్ అయి సన్నబడతాం.
- రక్తపోటు తగ్గుతుంది. ఎండార్ఫిన్ విడుదలై శరీరం విశ్రాంతి పొందుతుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో, మానసిక స్థితిని మెరుగుపర్చడంలో కృషిచేస్తుంది. ఆందోళన తగ్గడం వల్ల గుండె పనితీరు ఆరోగ్యవంతమవుతుంది.
ఎలా నవ్వాలో తెలియదా?
- కామెడీ సినిమాలు చూస్తూ ఉండాలి.
- స్టాండప్ కామెడీలు చూడటాన్ని ఇష్టపడాలి.
- కామెడీ సీన్లను మొబైల్ ఫోన్లో చూసేలా ప్లాన్ చేసుకోవాలి.
- కామెడీ పండించే మిత్రులతో సమయం గడిపేలా చూసుకోవాలి.
- గ్రూప్ ఎంటర్టైనింగ్ గేమ్ నైట్ వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.
- కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతూ వారిని కూడా నవ్వేలా ప్రోత్సహించాలి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

