జీవక్రియకు.. కర్త-కర్మ-క్రియ
మన శరీరంలో కీలకమైన హార్మోన్ గ్రంథుల్లో థైరాయిడ్ ఒకటి. ఇది శరీర జీవక్రియలు, పెరుగుదల, అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. రక్తంలోకి తగిన మోతాదులో థైరాయిడ్ హార్మోన్లను విడుదల చేస్తూ ఎన్నో శరీర విధులను క్రమబద్ధం చేస్తుంది. మెడ ముందు భాగంలో, స్వరపేటిక కింద ఉండే థైరాయిడ్ గ్రంథి సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. ఈ గ్రంథి నుంచి టీ3, టీ4, కాల్సిటోనిన్ అనే మూడు హార్మోన్లు విడుదల అవుతాయి.
మన శరీరంలో కీలకమైన హార్మోన్ గ్రంథుల్లో థైరాయిడ్ ఒకటి. ఇది శరీర జీవక్రియలు, పెరుగుదల, అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. రక్తంలోకి తగిన మోతాదులో థైరాయిడ్ హార్మోన్లను విడుదల చేస్తూ ఎన్నో శరీర విధులను క్రమబద్ధం చేస్తుంది. మెడ ముందు భాగంలో, స్వరపేటిక కింద ఉండే థైరాయిడ్ గ్రంథి సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. ఈ గ్రంథి నుంచి టీ3, టీ4, కాల్సిటోనిన్ అనే మూడు హార్మోన్లు విడుదల అవుతాయి. వీటిలో టీ3, టీ4 మాత్రమే థైరాయిడ్ హార్మోన్లు. ఈ గ్రంథి ఆరోగ్యంలో అయోడిన్ పాత్ర ముఖ్యమైంది. కాకపోతే, ఇది శరీరంలో ఉత్పత్తి కాదు. ఆహారం ద్వారానే తీసుకోవాల్సి ఉంటుంది.
మన శరీరానికి థైరాయిడ్ హార్మోన్ల అవసరం మారిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు ఎక్కువగా, ఇంకొన్నిసార్లు తక్కువగా స్వీకరిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో పీయూష గ్రంథి.. ఏ మేరకు హార్మోన్ విడుదల చేయాలనే విషయంలో థైరాయిడ్ గ్రంథిని నిర్దేశిస్తుంది. థైరాయిడ్ గ్రంథి స్రవించే మరో హార్మోన్ కాల్సిటోనిన్. ఇది ఎముకల ఆరోగ్యానికి అవసరమైన క్యాల్షియంతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటుంది. టీ3, టీ4 హార్మోన్ల కారణంగా శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఫలితంగా నాడి, గుండె వేగం పెరుగుతుంది. పిల్లల్లో మెదడు, శరీర పెరుగుదలలో ఈ హార్మోన్లు కీలకపాత్ర పోషిస్తాయి. ఏకాగ్రత, శరీర ప్రతిస్పందనల వేగం కూడా పెరుగుతుంది. థైరాయిడ్ ఎక్కువగా విడుదల కావడాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. తక్కువగా విడుదలయితే అది హైపోథైరాయిడిజం. కొన్నిసార్లు మాత్రం ఇది క్యాన్సర్ కావచ్చు. థైరాయిడ్‌లో మార్పులు కనిపిస్తే తగిన చికిత్స తీసుకోవాలి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- thyroid
- thyroid symptoms
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రేపే పోలింగ్.. సర్వం సిద్ధం చేశామన్న ఎన్నికల కమిషనర్..!
Supreme Court Bench | చెన్నైలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయండి.. ప్రధాని మోదీకి సీఎం విజయ్ లేఖ
Iran | భారత నౌకలకు హర్మూజ్‌లో ప్రత్యేక మినహాయింపు ఇచ్చిన ఇరాన్..!
Panchayat Secretaries | డోన్ట్ కేర్.. హాజరు వేసుకొని ఇంటికెళ్తున్న పంచాయతీ కార్యదర్శులు..!
Double Murder | మీర్పేట్లో జంట హత్యల కలకలం.. పోలీసుల నిర్లక్ష్యమే కారణమా..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

