ఈ మొక్కలు దోమతెరలు
వానకాలంలోనే కాదు ఎండలు మండే రోజుల్లోనూ కొన్ని ప్రాంతాల్లో దోమల బెడద తప్పదు. అడ్డుతెరలు ఎన్ని కట్టినా ఇంట్లోకి దోమలు రాకుండా అడ్డుకోవడం కష్టసాధ్యమే. నానావిధ కాయిల్స్, స్ప్రేలు, లిక్విడ్ లాంటివి వాడుతూనే ఉంటారు. కానీ, కొన్నిరకాల మొక్కలను ఇంటి ఆవరణలో పెంచితే కూడా దోమల బెడద ఉండదు.
వానకాలంలోనే కాదు ఎండలు మండే రోజుల్లోనూ కొన్ని ప్రాంతాల్లో దోమల బెడద తప్పదు. అడ్డుతెరలు ఎన్ని కట్టినా ఇంట్లోకి దోమలు రాకుండా అడ్డుకోవడం కష్టసాధ్యమే. నానావిధ కాయిల్స్, స్ప్రేలు, లిక్విడ్ లాంటివి వాడుతూనే ఉంటారు. కానీ, కొన్నిరకాల మొక్కలను ఇంటి ఆవరణలో పెంచితే కూడా దోమల బెడద ఉండదు.
నిమ్మగడ్డి: లెమన్ గ్రాస్ చూడటానికి అందంగా ఉంటుంది. మంచి వాసనను కూడా కలిగి ఉంటుంది. దీని పరిమళం మనసుకు ఆహ్లాదాన్నిస్తుంది. దోమలకు మాత్రం ఈ వాసన అస్సలు పడదు. నిమ్మగడ్డి ఉన్నచోట అవి ఉండలేవు. అందుకే, దోమల కట్టడికి నిమ్మగడ్డిని నమ్ముకుంటారు.
లెమన్ బామ్: లెమన్ బామ్ ఇంటి అలంకరణలో ముచ్చటగా భాగమవుతుంది. సూర్యరశ్మి లేకుండానే ఈ మొక్క ఏపుగా పెరుగుతుంది. దోమలు ఈ మొక్క ఉన్న పరిసరాలను కన్నెత్తి చూడవు, రెక్కలాడిస్తూ వాలవు.
బంతి మొక్క: దోమలను, ఇతర కీటకాలను నియంత్రించే శక్తి బంతి మొక్కలకూ ఉంది. బంతిపూల వాసన దోమలకు గిట్టదు. ఈ మొక్కలను బాల్కనీలో, కారిడార్‌లో పెంచుకుంటే పరిసరాల్లో దోమల తీవ్రత తగ్గుతుంది.
వెల్లుల్లి: వెల్లుల్లి ఘాటు పోటుమీదుంటే ఒక్కోసారి మనకే గిట్టదు. దోమలకు ఈ వాసనంటే అసలే పడదు. వెల్లుల్లి ఎక్కువగా తినేవారిని దోమలు తక్కువగా కుడతాయని కొన్ని అధ్యయనాల్లోనూ తేలింది. అందుకే, బాల్కనీలో ఒకటి రెండు కుండల్లో వెల్లుల్లి మొక్కలను నాటితే దోమల ఆగడాలకు అడ్డుపడ్డట్టే!
రోజ్మేరీ: రోజ్మేరీ మొక్కను దోమల నివారిణిగా పరిగణిస్తారు. ఈ మొక్క పువ్వులు భలేగా ఉంటాయి. వేసవిలో విరగబూస్తాయి కూడా! ఈ పూల వాసనకు దోమలు ఇంట్లోకి చొరబడలేవు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

