పెంపుడు కుక్కలు, పిల్లులు పడుకోడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినా సరే, అవి ఎప్పుడూ యజమానుల సోఫాల మీదే కనిపిస్తుంటాయి. కారణం సోఫాలు మందపాటి కుషన్‌తో మెత్తగా ఉండటమే. వాటి ఇష్టాన్ని గమనించి, సౌకర్యంగా పడుకోగలిగేలా ‘లౌలౌస్ ఫాలీస్’ సంస్థ కొత్త పెట్ బెడ్‌ను తీసుకొచ్చింది. సాధారణ పెంపుడు జంతువుల పరుపుల కంటే ఎక్కువ మందంగా, మెత్తగా ఉండేలా దీన్ని రూపొందించింది.
శరీరానికి హాయిగా అనిపించేలా కాటన్ లైనింగ్, పాలిస్టర్ ఫిల్లింగ్‌తో పాటు.. నచ్చినట్టు పడుకునేందుకు వీలుగా చుట్టూ ఎత్తునూ ఏర్పాటు చేసింది. పిల్లులు, కుక్కపిల్లలు మొదలు జర్మన్ షెపర్డ్లాంటి పెద్ద జాగిలాలు పడుకోగలిగేలా వివిధ సైజుల్లో లభిస్తున్నాయి. ధర రూ. 2,100తో మొదలు. వివరాలకు thabisa.shop.