Evil Eye Nail Art | దిష్టి తగలకుండా వేసే డిజైన్లే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్!
Evil Eye Nail Art | కొన్ని పదాలు మంచిని సూచిస్తే మరికొన్ని చెడును ప్రతిబింబిస్తాయి. అలాంటి వాటిని ఎప్పుడు పడితే అప్పుడు, ముఖ్యంగా శుభకార్యాలు, వేడుకలప్పుడు పలకడానికి కూడా ఇష్టపడం. కానీ చెడు గురించి చెప్పేదే అయినా మంచి సందర్భంలో హాయిగా వాడుకునే పదం.. దిష్టి.
Evil Eye Nail Art | కొన్ని పదాలు మంచిని సూచిస్తే మరికొన్ని చెడును ప్రతిబింబిస్తాయి. అలాంటి వాటిని ఎప్పుడు పడితే అప్పుడు, ముఖ్యంగా శుభకార్యాలు, వేడుకలప్పుడు పలకడానికి కూడా ఇష్టపడం. కానీ చెడు గురించి చెప్పేదే అయినా మంచి సందర్భంలో హాయిగా వాడుకునే పదం.. దిష్టి. ‘అబ్బో ఇవాళ దిష్టి తగులుతుందేమో’.. అని ఎవర్నయినా అన్నామంటే, కడుపు నిండిపోయినంత ఆనంద పడిపోతారు. ఆ దిష్టిని సూచించే ‘ఈవిల్ ఐ’ డిజైన్ ఆడపిల్లలు ధరించే గొలుసులు, ఉంగరాల్లాంటి నగల్లో కనిపిస్తుంటుంది కూడా. దీన్ని ధరిస్తే చెడుదృష్టి మన మీద పడకుండా ఉంటుందని నమ్ముతారు.

అలాంటి నగలు పెట్టుకోవడాన్నీ ఒక ట్రెండ్‌గా భావిస్తుంది కుర్రకారు. ఇప్పుడదే ఫ్యాషన్ ముద్ర గోళ్ల మీదికి చేరింది. ‘ఈవిల్ ఐ నెయిల్ ఆర్ట్’ ట్రెండ్‌గానూ మారింది. నీలం, నలుపు, తెలుపు రంగుల కలబోతతో కనుగుడ్డు, కన్ను ఆకృతుల్లో ఉంటుందీ డిజైన్. పొడవుగా సమానంగా ఉండేవీ, ఒంపుగా కనిపించేవీ, కోసుగా పదునుగా చెక్కినవీ.. ఇలా రకరకాల ఆకారాల్లో ఉండే గోళ్ల మీదకీ చక్కగా నప్పుతుంది ఇది. వీటికి తోడుగా గీతలూ, చుక్కలూ, వివిధ డిజైన్లను గోటి అలంకరణలో చేరుస్తున్నారు. రాళ్లూ, పూసల్ని కూడా జోడిస్తున్నారు. వీటన్నిటి మధ్యా అందమైన వేలికి పెట్టిన కిరీటంలా కనిపిస్తున్న ఈవిల్ ఐ… చూస్తేనే దిష్టి తగిలేలా కనిపించడం లేదూ!


Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

