Jowar benefits | జొన్నలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
Health Tips | ఆరోగ్యకరమైన జీవనానికి ఈ రోజుల్లో చిరుధాన్యాలకు మించిన ప్రత్యామ్నాయం లేదు. మధుమేహం, బీపీ లాంటి దీర్ఘకాలిక రోగుల సంఖ్య ఏటికేడు పెరిగిపోతుండటంతో చిరు ధాన్యాలకు డిమాండ్ ఏర్పడింది.
Jowar benefits | ఆరోగ్యకరమైన జీవనానికి ఈ రోజుల్లో చిరుధాన్యాలకు మించిన ప్రత్యామ్నాయం లేదు. మధుమేహం, బీపీ లాంటి దీర్ఘకాలిక రోగుల సంఖ్య ఏటికేడు పెరిగిపోతుండటంతో చిరు ధాన్యాలకు డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా కొర్రలు, అరికలు, జొన్నలు, రాగులు, సజ్జలు వంటి వాటిని జనం ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటిలో అన్నింటి కంటే ఎక్కువ ప్రయోజనకరమైనవి, మిగతావాటితో పోల్చితే తక్కువ ధరకు లభ్యమయ్యేవి జొన్నలు మాత్రమే. మరి జొన్నలతో కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందామా..?
జొన్నలతో ఆరోగ్యం..
1. జొన్నలతో చేసే ఏ పదార్థమైనా బలవర్ధకమైనదే. బియ్యం, గోధుమలతో పోల్చితే జొన్నల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది.
2. రోజూ జొన్నపిండితో చేసిన రొట్టెలు తినడంవల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అదేవిధంగా జొన్న గటక, జొన్న జావ, జొన్న అన్నం ఇలా ఏ రకంగా తీసుకున్నా జొన్నలతో మేలే జరుగుతుంది.
3. జొన్నల్లో ఇనుము, ప్రోటీన్లు, పీచు పదార్ధాల్లాంటి పోషకాలు ఎక్కువ. కాబట్టి గుండె జబ్బులు రాకుండా అడ్డుకునే గుణం జొన్నల్లో ఉంది.
4. ఆరోగ్యానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ జొన్నల్లో పుష్కలంగా ఉంటాయి. శరీరంలో ఉండే చెడు కొవ్వును తగ్గించే శక్తి జొన్నలకు ఉంది.
5. ఎముకలు బలిష్టంగా ఉంచేందుకు కావాల్సిన ఫాస్పరస్ జొన్నల్లో లభిస్తుంది. నరాల బలహీనతను తగ్గించే గుణం కూడా జొన్నలకు ఉంది.
6. రోజూ జొన్నలతో చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడంవల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వయసు పెరిగేకొద్దీ వచ్చే మతిమరుపు, కంటిచూపు మందగించడం లాంటి సమస్యలు కూడా జొన్నలు ఎక్కువగా వాడటంవల్ల తగ్గుతాయి.
7. జొన్నల్లో పిండి పదార్థం ఎక్కువగా ఉండటంవల్ల జీర్ణశక్తి పెంపొందుతుంది. జొన్నలు ఆహారంగా తీసుకోవడంవల్ల జీర్ణశక్తి కావాల్సిన హార్మోన్లు కూడా వృద్ధి చెందుతాయి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

