ఎరుపు వర్ణానికి తానే మహారాణినని ప్రకటించుకుందేమో ముద్ద మందారం.. ఆ రంగులో ఏ అందాన్ని చూసినా మందారమంత ముచ్చటగానే అనిపిస్తుంది. దాని నాజూకు సోకే కనిపిస్తుంది. ఇక్కడ అరుణ వర్ణపు గౌనులో అందాల రాశిని చూసినా మనసుదీ అదే తోవ. పట్టులా మెరిసే కుచ్చుల గౌను అచ్చంగా పూల సౌందర్యాన్నే తలపిస్తున్నది.
ఫ్యాషన్ వెలుగులీనుతున్న దుస్తులకు జతగా మణులు పొదిగిన నాగాభరణాలు ధరించింది ‘నాట్యం’ సినిమా కథానాయిక సంధ్యారాజు. ఆంగ్ల పత్రిక ‘హలో’ తాజాగా ఆమె ఛాయా చిత్రాలతో ఓ కథనం ప్రచురించింది కూడా.