అమ్మ కోసమే.. డ్యాన్స్!
అమ్మకు ఆసరాగా నిలిచేందుకు ఎంచుకున్న దారి సెలెబ్రిటీని చేసింది.డ్యాన్స్ చేసిన పాటే ఆమె ఇంటి పేరైంది. కండక్టర్‌గా రైట్‌రైట్ చెబుతూనే నృత్యంతో అందరికీ దగ్గరైంది పల్సర్ బైక్ ఝాన్సీ. జీ తెలుగు ‘సూపర్ క్వీన్-2’ ద్వారా తెలుగు ప్రేక్షకుల అభిమానం చూరగొన్న ఝాన్సీతో ముచ్చట్లు..
అమ్మకు ఆసరాగా నిలిచేందుకు ఎంచుకున్న దారి సెలెబ్రిటీని చేసింది.డ్యాన్స్ చేసిన పాటే ఆమె ఇంటి పేరైంది. కండక్టర్‌గా రైట్‌రైట్ చెబుతూనే నృత్యంతో అందరికీ దగ్గరైంది పల్సర్ బైక్ ఝాన్సీ. జీ తెలుగు ‘సూపర్ క్వీన్-2’ ద్వారా తెలుగు ప్రేక్షకుల అభిమానం చూరగొన్న ఝాన్సీతో ముచ్చట్లు..
ఇష్టంతోనో, ఆసక్తితోనో నేను డ్యాన్స్ నేర్చుకోలేదు. అవసరమే ఆ దారిలో నడిపించింది. ఐదో తరగతిలో ఉన్నప్పుడే అమ్మానాన్న విడిపోయారు. మాకోసం ఒంటరిగా కష్టపడుతున్న అమ్మకు సహకరించాలనే ఈ ఫీల్డ్ ఎంచుకున్నాను. మొదటి ప్రదర్శనకు నూటయాభై రూపాయలు ఇచ్చారు. అదే నా మొదటి సంపాదన. ఆ డబ్బు అమ్మ చేతిలో పెట్టాను. తమ్ముడిని చదివిస్తూనే నేనూ చదువుకున్నాను. మొదటిసారి, జీ తెలుగుఆడిషన్స్కు వెళ్లినప్పుడు నేను ఎంపిక కాలేదు. కెమెరా చూసి చాలా భయపడిపోయాను. నా మొదటి గురువు రమేశ్ చాలా ఎంకరేజ్ చేశారు.

ఆయన చెప్పడం వల్లే ‘తీన్ మార్ షో’ కోసం రాత్రి 8 గంటలకు వెళ్లి ఆడిషన్స్ ఇచ్చాను. సెకండ్ రన్నరప్‌గా నిలిచాను. ఇదంతా మా బంధువులకు నచ్చేది కాదు. నన్ను చులకనగా చూసేవారు. అయినా నేను లెక్కచేయలేదు. నేను ప్రేమ పెళ్లి చేసుకున్నాను. ఇప్పటికీ ఉద్యోగం, డ్యాన్స్ బ్యాలెన్స్ చేస్తున్నానంటే నా భర్త ప్రోత్సాహమే కారణం. నేను పెళ్లి చేసుకుని వెళ్లిపోయే సమయానికి తమ్ముడు తొమ్మిదో తరగతిలో ఉన్నాడు. ఒకపక్క చదువుకుంటూనే పేపర్ వేస్తూ, చిన్న పిల్లలకు ట్యూషన్లు చెబుతూ అమ్మకు ఆసరాగా నిలిచాడు. మొదట్లో విమర్శించిన వాళ్లే ఇప్పుడు..‘నా మేనకోడలు, నా మరదలు, నా కూతురు వరుస’ అని నా గురించి గర్వంగా చెప్పుకొంటున్నారు.
సూపర్ క్వీన్‌గా..
సూపర్ క్వీన్-2కు ఎంపికైనప్పుడు చాలా సంతోషించాను. ఎలాగైనా గెలవాలి అనుకున్నాను కానీ, ఫైనల్ ఎపిసోడ్లో ఒత్తిడి వల్ల దెబ్బతిన్నాను. గెలవడం, గెలవకపోవడం కాదు. పదిమంది మహిళలతో పోటీపడటం, ప్రేక్షకులకు వినోదం పంచడం నా అదృష్టంగా భావించాను. అంతపెద్ద షోలో భాగమై, ఫైనల్స్ వరకూ చేరుకోవడమే చాలా పెద్ద విషయం. సినిమాల్లో, సీరియల్స్‌లో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తా.
…? హరిణి
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

