Fashion | సంప్రదాయాన్నీ ఆధునికతనూ కలబోసి వడబోసే విషయంలో ఇప్పటి డిజైనర్లు చేయి తిరిగిన నలభీములే. ఇంతి ఒంటికి ఇంపైన దుస్తుల్ని అలంకరించి అలరించే విషయంలో వీళ్లకు వీళ్లే సాటి. నార దుస్తుల్నీ నారికి నప్పేలా మతలబు చేయగల మాయాజాలం వీళ్ల సొంతం.
ఇక్కడ గచ్చకాయ రంగులో ఫ్యాషనబుల్‌గా కనిపిస్తున్నది జూట్ సిల్క్ లెహెంగానే. దానికి గోధుమ వన్నె పెన్ కలంకారీ క్రాప్‌టాప్‌ను జతచేసి హ్యాండ్ ఎంబ్రాయిడరీతో ముస్తాబు చేశారు. ప్రత్యేక సందర్భాల్లో ధరించే విభిన్న కాంబినేషన్ కదూ!