అయినా.. పాలు పట్టొచ్చు!
బిడ్డకు తల్లిపాలను మించిన పౌష్టికాహారం లేదన్న సంగతి తెలిసిందే. అయితే, మారుతున్న జీవనశైలితో చాలామంది చిన్నవయసులోనే ‘డయాబెటిక్' బారిన పడుతున్నారు. ఇలాంటి షుగర్ బాధితులు.. పిల్లలకు పాలు పట్టొచ్చా? అని చాలామంది అనుమాన పడుతుంటారు.
బిడ్డకు తల్లిపాలను మించిన పౌష్టికాహారం లేదన్న సంగతి తెలిసిందే. అయితే, మారుతున్న జీవనశైలితో చాలామంది చిన్నవయసులోనే ‘డయాబెటిక్’ బారిన పడుతున్నారు. ఇలాంటి షుగర్ బాధితులు.. పిల్లలకు పాలు పట్టొచ్చా? అని చాలామంది అనుమాన పడుతుంటారు. ఈ విషయంలో.. వైద్య నిపుణులు సలహాలు, సూచనలు అందిస్తున్నారు.
టైప్-1, టైప్-2, ప్రెగ్సెన్సీ డయాబెటిక్ బాధితులు పిల్లలకు పాలు ఇవ్వొచ్చని ‘అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్’ స్పష్టం చేస్తున్నది. దీనివల్ల బిడ్డతోపాటు తల్లికీ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నది. బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల… డయాబెటిక్ తల్లుల శరీరంలో ఉత్పత్తయ్యే ఇన్సులిన్ బాగా పనిచేస్తుందట. రక్తంలో గ్లూకోజ్ స్థాయులు కూడా నియంత్రణలో ఉంటాయని చెబుతున్నారు. ఇక ప్రెగ్నెన్సీ డయాబెటిక్ (గర్భధారణ సమయంలోనే వచ్చే మధుమేహం) ఉన్న మహిళలు.. బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల తరువాతి దశలో టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశం 15-30% తగ్గుతుందని అంటున్నారు.
టైప్-1 డయాబెటిస్ ఉన్న మహిళలు పాలు పట్టడం వల్ల.. ఇన్సులిన్ అవసరాలు 25-50% తగ్గుతాయట. ఎందుకంటే, వారిలో పాల ఉత్పత్తి కోసం రక్తంలోని గ్లూకోజ్ అవసరం పడుతుంది. అదేవిధంగా, టైప్-2 డయాబెటిస్ ఉన్న తల్లుల్లోనూ బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా రక్తంలో గ్లూకోజ్ స్థాయులు నియంత్రణలో ఉంటాయని అంటున్నారు. అదే సమయంలో.. డయాబెటిస్ నియంత్రణ కోసం జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే.. ప్రసవానంతరం చాలామందిలో ఒత్తిడి అధికం అవుతుంది. పాలు ఇస్తున్నప్పుడు రోజువారీ కేలరీల అవసరం పెరుగుతుంది. కాబట్టి, అందుకు తగ్గట్టుగా, తల్లిగా కొత్త జీవితానికి సరిపోయేలా ఆరోగ్యకరమైన అలవాట్లను ప్లాన్ చేసుకోవాలని చెబుతున్నారు.
- భోజనంలో లీన్ ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండేలా చూసుకోవాలి. అధిక ఫైబర్ ఉండే తృణధాన్యాలు, చిక్కుళ్లు, కూరగాయలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి.
- ఎట్టిపరిస్థితుల్లోనూ భోజనం దాటవేయవద్దు. ఎందుకంటే ఇది ఇన్సులిన్ స్థాయులను ప్రభావితం చేస్తుంది. దీన్ని నివారించడానికి స్నాక్స్‌లో ప్రొటీన్ ఉండేలా చూసుకోవాలి.
- శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండేందుకు.. రోజూ 3-4 లీటర్ల నీళ్లు తాగాలి. ఈ అలవాటు పాల ఉత్పత్తితోపాటు రక్తంలో గ్లూకోజ్ నియంత్రణకు సహాయపడుతుంది.
- వైద్యుల సలహా మేరకు తేలికపాటి వ్యాయామాలు చేయాలి. దీనివల్ల మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది. ఒత్తిడి తగ్గుతుంది.
- నిద్రలేమి కూడా ఒత్తిడితోపాటు రక్తంలో గ్లూకోజ్ స్థాయులను పెంచుతుంది. కాబట్టి, కంటి నిండా నిద్రపోవాలి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

