Adulterated Ghee | కల్తీ నెయ్యిని ఈ సింపుల్ చిట్కాలతో గుర్తించండి!
Adulterated Ghee | అసలు కంటే నకిలీలే ఆకట్టుకుంటున్న కాలమిది. అందమైన ప్యాకింగ్, ఆకట్టుకునే ఆఫర్లతో కల్తీ సరుకు మార్కెట్‌ని ఏలుతున్నది. ఇలా కల్తీ కాటుకు గురైన పదార్థాల్లో నెయ్యి ఒకటి. ముద్దపప్పు రుచిని మూడింతలు పెంచే నెయ్యి కల్తీదైతే..
Adulterated Ghee | అసలు కంటే నకిలీలే ఆకట్టుకుంటున్న కాలమిది. అందమైన ప్యాకింగ్, ఆకట్టుకునే ఆఫర్లతో కల్తీ సరుకు మార్కెట్‌ని ఏలుతున్నది. ఇలా కల్తీ కాటుకు గురైన పదార్థాల్లో నెయ్యి ఒకటి. ముద్దపప్పు రుచిని మూడింతలు పెంచే నెయ్యి కల్తీదైతే.. రుచి మాట దేవుడెరుగు, ఆరోగ్యానికి ముప్పు తప్పదు. చిన్నపిల్లలు నెయ్యి లేకుండా ముద్ద ముట్టరు. అలాంటి పసిపాపలకు కల్తీ నెయ్యితో గోరుముద్దలు తినిపిస్తే.. ఎంత ప్రమాదం. అందుకే, నెయ్యి తీసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. నెయ్యి స్వచ్ఛతను పరీక్షించాలంటే ఈ సూత్రాలు పాటించండి.
నీటి పరీక్ష: ఒక గాజు గ్లాసులో నీళ్లను నింపండి. అందులో చిన్న నేతి ముద్దను వేయండి. అది నీటిపై తేలితే అస్లీ.. నీట మునిగితే కల్తీ జరిగినట్టే.
వేడి పరీక్ష: ఒక గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసి, పొయ్యి మీద పెట్టి కరిగించాలి. దాన్ని ఒక గాజు గ్లాసులో పోయాలి. నెయ్యి వేడి కొద్దిగా తగ్గిన తర్వాత గ్లాసును ఫ్రిజ్‌లో పెట్టాలి. నెయ్యి గడ్డకట్టిన తర్వాత చూస్తే అంతా ఒకే తీరుగ ఉంటే కల్తీ లేనట్టు. అట్లా కాకుండా పైన ఒక పొరలా ఏర్పడితే ఆ నెయ్యిలో ఏవో నూనెలు కలిపారని గుర్తించాలి.
అయోడిన్ పరీక్ష: ఒక గిన్నెలో కొంత నెయ్యి తీసుకోవాలి. అందులో కొన్ని చుక్కలు అయోడిన్ వేసి కలపాలి. నెయ్యి రంగు మారితే కల్తీ జరిగినట్టు. రంగు మారకపోతే అది అసలైన నెయ్యి. నెయ్యిని పిండితో కల్తీ చేస్తే అయోడిన్ పరీక్షలో అది నీలం రంగులోకి మారుతుంది.
చేతి పరీక్ష: నేతి ముద్ద కొంచెం చేతిలో వేసుకున్నాక, ఏటవాలుగా చేతిని వంచండి. శరీరం వేడికి నెయ్యి నెమ్మదిగా కరుగుతూ కిందికి జారిపోతుంది. కల్తీ జరిగితే కరిగిపోకుండా చేతిపైనే మిగిలి ఉంటుంది.
ఆమ్ల పరీక్ష: ఒక టెస్ట్ ట్యూబ్‌లో కొద్దిగా నెయ్యి వేసి, అందులో హైడ్రో క్లోరిక్ ఆమ్లం చుక్కలు కొన్ని వేయాలి. ఆ రెంటినీ కలిపితే నెయ్యి రంగు మారకపోతే స్వచ్ఛమైన నెయ్యిగా భావించొచ్చు. కల్తీ జరిగితే రంగు మారుతుంది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
Khammam Road Accident | గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

